హైదరాబాద్: శుక్రవారం (డిసెంబర్ 2) గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం యువీ, హాజెల్ కీచ్‌ల వివాహం జరిగింది. నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు.
పెళ్లి అనంతరం యువరాజ్-హాజెల్ కీచ్‌లతో కలిసి టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ అద్భుతమైన డ్యాన్స్ చేశాడు. ఈ సందర్భంగా యువీ నీలిరంగు సూట్‌లో, హాజెల్‌కీచ్ తెల్లని గౌనులో మెరిసిపోయారు. ఇద్దరు కేక్ కట్ చేసి, కపుల్ డ్యాన్స్ చేశారు.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తన ప్రేయసి గర్ల్ ప్రెండ్ అనుష్క శర్మతో కలిసి కోహ్లీ చేసిన డ్యాన్స్ ఎంతగానో అలరించింది. నవంబర్ 30వ తేదీన సిక్కు సంప్రదాయ ప్రకారం చండీగఢ్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
చంఢీఘగడ్‌లో జరిగిన మెహందీ, సంగీత్‌కు హాజరైన వీరిద్దరూ గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకున్న పెళ్లికి కూడా హాజరయ్యారు. అక్కడ యువీ, హాజెల్ జంటతో పాటు కోహ్లీ, అనుష్క జోడి కూడా బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడం విశేషం.