Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs SA: ర‌న్నింగ్‌లో సింగిల్ హ్యాండ్‌తో విల్ యంగ్‌ సూప‌ర్ క్యాచ్.. కామెంటేట‌ర్లు ఫిదా! నెట్టింట వైర‌ల్‌

Viral: Will Young make a super catch in the second Test against New Zealand vs South Africa

న్యూజిలాండ్, సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కివీస్ ఫీల్డర్ విల్ యంగ్ ప‌ట్టిన ఓ సూప‌ర్ క్యాచ్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. బౌండ‌రీ లైన్ వైపున‌కు ప‌రిగెడుతూ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో విల్ యంగ్ అద్భుతంగా ప‌ట్టిన క్యాచ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. విల్ యంగ్ ప‌ట్టిన ఆ క్యాచ్‌ను చూసి కామెంటేట‌ర్ల‌తోపాటు తోటి ఆట‌గాళ్లు న‌మ్మ‌లేక‌పోయారు. అస‌లు ఏం జ‌రిగిందంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్ర‌మంలో ఇన్నింగ్స్ 79వ ఓవ‌ర్‌ను న్యూజిలాండ్ బౌల‌ర్ గ్రాండ్ హోం వేశాడు. ఆ ఓవ‌ర్ రెండో బంతిని మార్కో జాన్సెన్ భారీ షాట్ ఆడాడు. దీంతో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న విల్ యంగ్ ముందుకు ప‌రిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో ఆ క్యాచ్ అందుకున్నాడు.

ఆ క్యాచ్ చూస్తే న‌మ్మ‌లేని విధంగా ఉంది. కామెంటేట‌ర్లు సైతం ఇదే వ్యాఖ్యానించారు. విల్ యంగ్ క్యాచ్‌కు అంతా ఫిదా అయిపోయారు. దీంతో కామెంటేట‌ర్ల‌తోపాటు తోటి ఆట‌గాళ్లు విల్ యంగ్‌పై ప్ర‌శంసలు కురిపించారు. ఇటు క్రికెట్ అభిమానులు సైతం విల్ యంగ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. విల్ యంగ్ అద్భుత క్యాచ్‌తో మార్కో జాన్సెన్ 9 ప‌రుగులకే ఔట‌య్యాడు. ఇలాంటి క్యాచ్‌ను ఎప్పుడూ చూడ‌లేదంటూ అభిమానులు కొనియాడుతున్నారు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే నాలుగో రోజు ఆట ముగిసే స‌మయానికి అతిథ్య న్యూజిలాండ్ 4 వికెట్ల న‌ష్టానికి 94 ప‌రుగులు చేసింది. క్రీజులో డేవాన్ కాన్వే (60), టామ్ బ్లండెల్ (1) ఉన్నారు. నాల్గో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ 332 ప‌రుగులు చేసింది. అదే సౌతాఫ్రికా గెల‌వాలంటే మ‌రో 6 వికెట్లు తీస్తే స‌రిపోతుంది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 354-9 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్డ్‌ చేసింది. వికెట్ కీప‌ర్ వెర్రెయిన్నే 136 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 364 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇక న్యూజిలాండ్ విష‌యానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో 293 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అంత‌కు ముందు తొలి ఇన్నింగ్స్‌లో సరేల్ ఎర్వీ 108 ప‌రుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో గ్రాండ్‌హోమ్ సెంచ‌రీ చేశాడు. మొత్తంగా 120 ప‌రుగుల‌తో గ్రాండ్ హోమ్ అజేయంగా నిలిచాడు.

Story first published: Monday, February 28, 2022, 16:45 [IST]
Other articles published on Feb 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+