మెల్బోర్న్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అంటే క్రికెట్ అభిమానులకు ఎంత పిచ్చో చెప్పవలసిన అవసరం లేదు. సోమవారం నాడు యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. తద్వారా సచిన్ అంటే ఎవరికైనా ఎంత అభిమానమో తెలియజెప్పేందుకు ఆ వీడియో కూడా ఓ నిదర్శనం అని చెప్పవచ్చు.
<center><iframe width="100%" height="360" src="https://www.youtube.com/embed/anxo7r_0Ss0?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్వెల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ను హగ్ చేసుకునేందుకు టెలివిజన్ ఇంటర్వ్యూ మధ్యలోనే పక్కకు వచ్చాడు. ఈ వీడియోను సోమవారం అప్ లోడ్ చేయగా.. ఇరవై నాలుగు గంటల్లో లక్షా యాభై వేల మందికి పైగా చూశారు.
సోషల్ మీడియాలో దీని పైన అభిమానులు చర్చించుకుంటున్నారు కూడా. గత నెల మార్చి 29న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా ఆటగాళ్లను గ్రీట్ చేసేందుకు మైదానంలోకి వచ్చారు. ఆ సమయంలో మాక్స్వెల్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతున్నాడు.
సచిన్, ఇతర ఐసీసీ ప్రతినిధులు మైదానంలోకి రావడాన్ని చూసిన మాక్స్వెల్.. టీవీ ఇంటర్వ్యూను పక్కన పెట్టి, మధ్యలోనే వచ్చి సచిన్‌ను హగ్ చేసుకున్నాడు. సచిన్ కూడా వారిని అభినందించాడు. కాగా, మాక్స్వెల్, సచిన్‌లు ముంబై ఇండియన్స్ తరఫున కలిసి ఐపీఎల్లో ఆడారు. ప్రస్తుతం మాక్స్వెల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. తన బ్యాటింగ్ టెక్నిక్స్ మెరుగుపడడానికి సచిన్ కారణమని మాక్స్వెల్ చెప్పాడు.