Viral Video: ఇది క్యాచ్ కాదు, అద్భుతం!: ఫీల్డింగ్ చూసి కళ్లు తేలేసిన పాక్ క్రికెటర్!
Viral Video: ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టుపై శ్రీలంక జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో శ్రీలంక ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. అయితే శ్రీలంక ఓడిపోయినా.. స్టార్ ఆటగాడు వనిందు హసరంగా పట్టిన క్యాచ్ మాత్రం సోషల్ మీడియాలో వైరలవుతోంది. పాకిస్తాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్‌ను ఔట్ చేయడానికి వనిందు హసరంగా పట్టిన క్యాచ్ అద్భుతానికి తక్కువేం కాదు.
అబ్రార్ అహ్మద్ తరహాలో హసరంగా సంబరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ వేయడానికి వచ్చిన మహీశ్ తీక్షణ.. ఫఖర్ జమాన్‌కు బంతి వేశాడు. ఫఖర్ జమాన్ మిడ్-ఆఫ్ దిశగా గట్టిగా షాట్ ఆడాడు. అయితే ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న వనిందు హసరంగా డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ పట్టి ఫఖర్ జమాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. హసరంగా పట్టిన ఈ క్యాచ్ చూసి ఫఖర్ జమాన్ కళ్లు తేలేశాడు. ఫఖర్ జమాన్ క్యాచ్ పట్టిన అనంతరం హసరంగా సంబరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్యాచ్ పట్టిన తర్వాత హసరంగా పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ తరహాలో మెడను అటు ఇటు ఊపుతూ బ్యాటర్‌ను వెళ్లమని సైగ చేశాడు. గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ను బౌల్డ్ చేసినప్పుడు అబ్రార్ అహ్మద్ ఈ తరహా సంబరాలు చేసుకోవడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

కష్టపడి గెలిచిన పాకిస్తాన్
సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు శ్రీలంకపై కష్టపడి గెలిచింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్‌పై శ్రీలంక టాపార్డర్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. అయితే 134 పరుగుల లక్ష్యం కూడా పాకిస్తాన్ కు అంత తేలికగా అనిపించలేదు. చివరకు పాకిస్తాన్ చాలా కష్టపడి 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి మ్యాచ్ ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఆటతీరు కన్నా పాక్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన ఎక్కువగా చర్చనీయాంశమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications