Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral Video: కళ్లుచెదిరే డైవింగ్ క్యాచ్.. క్షణాల్లో గాల్లోకి లేచి క్యాచ్ పట్టిన హైదరాబాద్ స్టార్!

Viral Video: క్రికెట్ ప్రపంచంలో క్యాచ్‌లు మ్యాచ్ లను గెలిపిస్తాయనే సామెత తరచూ నిజమవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఫీల్డర్లు పట్టే అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చడమే కాకుండా క్రీడాభిమానులను ముగ్ధులను చేస్తాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడటంతో పాటు దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్ ఇటీవల ఓ నమ్మశక్యం కాని క్యాచ్‌తో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాడు.

Vaibhav Sooryavanshi: కెప్టెన్సీ మ్యాజిక్.. అంపైర్‌కే షాకిచ్చిన బేబీ బాస్! (వీడియో)

Vaibhav Sooryavanshi: కెప్టెన్సీ మ్యాజిక్.. అంపైర్‌కే షాకిచ్చిన బేబీ బాస్! (వీడియో)

ఈ అద్భఫుత ఘట్టం దులీప్ ట్రోఫీ 2026 నార్త్ జోన్ ఇన్నింగ్స్ 25వ ఓవర్లో చోటుచేసుకుంది. సౌత్ జోన్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ వేసిన ఫుల్-లెంగ్త్ బంతి ఆఫ్-స్టంప్‌కు వెలుపలగా వెళ్లి కొద్దిగా టర్న్ అయింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న నార్త్ జోన్ బ్యాటర్ అబ్దుల్ సమద్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ బయటి అంచుకు తగిలి అతివేగంగా ఫస్ట్ స్లిప్‌లో ఉన్న స్మరణ్ రవిచంద్రన్ వైపు దూసుకెళ్లింది.

Viral Video Smaran Ravichandran Catch Leaves Abdul Samad Shocked in Duleep Trophy 2026 Full Details

స్లిప్‌లో అత్యంత అప్రమత్తంగా ఉన్న స్మరణ్ రవిచంద్రన్.. మొదట తన కుడి చేతితో బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అది చేతిలోంచి జారి కిందకు పడిపోవడం ప్రారంభించింది. సాధారణంగా చాలా మంది ఫీల్డర్లు ఇటువంటి సమయంలో క్యాచ్‌ను వదిలేస్తుంటారు. కానీ స్మరణ్ రవిచంద్రన్ ఏ మాత్రం ఆశను కోల్పోలేదు. బంతి నేలను తాకే చివరి క్షణంలో అతను ముందుకు డైవ్ చేసి దాన్ని రెండు చేతులతో సురక్షితంగా గ్రౌండ్‌కు తాకకుండా అందుకున్నాడు.

స్మరణ్ రవిచంద్రన్ ప్రదర్శించిన ఈ అద్భుతమైన చురుకుదనం, సమయస్ఫూర్తిని చూసి బ్యాటర్ అబ్దుల్ సమద్ నిశ్చేష్టుడయ్యాడు. తాను ఔట్ అయిన తీరును అబ్దుల్ సమద్ నమ్మలేకపోయాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 16 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ ఔట్ కావడంతో నార్త్ జోన్ జట్టు 95 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.

గౌతమ్ గంభీర్ కూతురికి అరుదైన గౌరవం!

Also Read

గౌతమ్ గంభీర్ కూతురికి అరుదైన గౌరవం!

అంతకు ముందు మ్యాచ్‌లో నార్త్ జోన్ కెప్టెన్ వధావన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్, ఆయుష్ దోసెజా రెండో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. వరుసగా వికెట్లు పడటంతో ఆ జట్టు వెనుకబడింది. నార్త్ జోన్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 195 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. అయితే మ్యాచ్ ఫలితం కంటే స్మరణ్ రవిచంద్రన్ పట్టి ఈ సూపర్ క్యాచ్ మాత్రం నెట్టింట క్రీడాభిమానుల మనసులను దోచుకుంది.

Story first published: Sunday, August 30, 2026, 18:05 [IST]
Other articles published on Aug 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+