Viral Video: టీమిండియాలో యువ ఓపెనర్లుగా రాణిస్తున్న శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్లు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ దగ్గర శిక్షణ పొందారు. మైదానంలోనూ, బయట కూడా తమ స్నేహంతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆసియా కప్ 2025 కోసం జట్టులో ఉన్నారు.
సెప్టెంబర్ 8న(సోమవారం) శుభ్‌మన్ గిల్ 26వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో అభిషేక్ శర్మ తన స్నేహితుడైన శుభ్‌మన్ గిల్‌కు అందరి ముందు ఎర్ర గులాబీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. అనూహ్యం ఎర్ర గులాబీ అందుకున్న శుభ్‌మన్ గిల్ ఒక్కసారిగా సిగ్గుపడి నవ్వేసుకున్నాడు. కెమెరావైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ ముఖం దాచుకున్నాడు. ఈ అరుదైన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్ అయింది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ అయిన ఈ వీడియోలో అభిషేక్ శర్మ గులాబీ ఇవ్వగానే.. శుభ్‌మన్ గిల్ ఆశ్చర్యపోయి.. చిరునవ్వుతో తన ముఖాన్ని చేతులతో కవర్ చేసుకున్నాడు. ఈ రియాక్షన్‌ను చూసిన అభిమానులు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. తన స్నేహితుడి నుంచి ఎర్ర గులాబీ తీసుకున్న శుభ్‌మన్ గిల్.. ఓ అమ్మాయి మాదిరిగా సిగ్గుపడడం అందరినీ ఆకట్టుకుంది.
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ ఇప్పుడు ఆసియా కప్ 2025 టీమ్‌లో ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో వీరిద్దరూ ఓపెనింగ్ బ్యాటర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. టీ20 జట్టు నుంచి కొంతకాలం దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను సెలెక్టర్లు ఆసియా కప్ కోసం వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 1999లో జన్మించిన శుభ్‌మన్ గిల్.. 2018లో పృథ్వీ షా సారథ్యంలో భారత్ గెలిచిన అండర్-19 ప్రపంచ కప్‌తో వెలుగులోకి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన ఆటతీరుతో సీనియర్ జట్టులోకి అడుగుపెట్టి, మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ అయ్యే సత్తా ఉందని నిరూపించుకున్నాడు.
ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్:
ఆసియా కప్‌లో గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమాన్ ఉన్నాయి. భారత జట్టు సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్, సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో కీలక పోరు ఆడనుంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఉంటుంది.