Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రత్యేక పార్టీ.. బ్రావోతో కలిసి లుంగీ డ్యాన్స్‌ చేసిన షారుక్‌ ఖాన్‌!!

Viral Video: ShahRukh Khan, DJ Bravo Doing Lungi Dance over CPL Win

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ విజయం సాధించిన అనంతరం విండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావోతో కలిసి బాలీవుడ్ 'బాద్‌షా' షారుక్‌ ఖాన్‌ డ్యాన్స్ చేసిన అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో బాద్‌షాకు చెందిన పాపులర్ హిట్ సాంగ్స్‌కు ఇద్దరూ కలిసి డాన్స్ వేశారు.

మూడు మ్యాచుల్లో విజయం:

విండీస్ గడ్డపై ప్రస్తుతం కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో షారుక్‌ ఖాన్‌కు చెందిన జట్టు ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వెస్టిండీస్‌ స్టార్ క్రికెటర్ కీరన్‌ పొలార్డ్‌ ట్రిన్‌బాగో జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ట్రిన్‌బాగో ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఆటగాళ్లకు ప్రత్యేక పార్టీ:

ట్రిన్‌బాగో ఆదివారం మూడో విజయం సాధించడంతో ఆ జట్టు యజమాని అయిన షారుక్‌.. ఆటగాళ్లకు ప్రత్యేక పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో డ్వేన్‌ బ్రావో, షారుక్‌ స్టెప్పులేస్తూ సందడి చేశారు. ముఖ్యంగా షారుక్‌ నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలోని లుంగీ డ్యాన్స్‌ పాటకు డ్యాన్స్‌ చేశారు. బ్రావో, షారుక్‌ ఇద్దరూ ఒకరికొకరు స్టెప్పులు నేర్పించుకున్నారు. అనంతరం షారుక్‌ జట్టు ఆటగాళ్లతో కూడా డాన్స్ చేసాడు. ఇదంతా అక్కడ ఉన్న వారు వీడియో తీశారు.

అద్దెకు తీసుకొని పార్టీ చేసుకున్నాం:

డాన్స్ స్పెప్పులకు సంబందించిన వీడియోలను బ్రావో తన ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. 'పీపీఎల్‌పై విజయం తర్వాత మేము పడవను అద్దెకు తీసుకొని పార్టీ చేసుకున్నాం. షారుక్‌ అద్భుతంగా డాన్స్ చేసాడు' అని బ్రావో రాసుకొచ్చాడు. ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా షారుక్‌ ఖాన్‌ యజమాని అన్న విషయం తెలిసిందే. మరోవైపు షారుక్‌ కూడా తన ట్విట్టర్ ఖాతాలో వీడియోలను పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

Story first published: Tuesday, September 10, 2019, 13:28 [IST]
Other articles published on Sep 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+