Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral Video: అర్ధరాత్రి ఆస్పత్రికి రోహిత్ శర్మ.. అభిమానుల్లో టెన్షన్!

Viral Video: భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధరాత్రి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 8న రాత్రి ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. రోహిత్ శర్మ ఆస్పత్రికి వెళ్లడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది.

కోకిలాబెన్ ఆస్పత్రిలో రోహిత్ శర్మ
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల గణపతి పూజలో కనిపించారు. కానీ ఇప్పుడు ఆయన సెప్టెంబర్ 8న అర్ధరాత్రి హఠాత్తుగా ఆస్పత్రికి వెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. రోహిత్ కు ఏమైందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ కోకిలాబెన్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లారనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్‌నెస్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మ బ్రేక్ లో ఉన్నారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. అంతకు ముందు ఈ నెలలో జరిగే భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ మధ్య జరిగే మ్యాచ్‌లలో కూడా ఆయన ఆడే అవకాశం ఉంది.

Viral Video Rohit Sharma Rushed to Hospital Late at Night Fans Worried

ఆ వైరల్ వీడియోలో ఏముంది?
సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక వీడియోలో రోహిత్ శర్మ కారులోంచి దిగి ఆసుపత్రిలోకి వెళ్తూ కనిపించారు. ఈ సమయంలో ఒక సెక్యూరిటీ గార్డు ప్రజలను వీడియోలు తీయకుండా అడ్డుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రోహిత్ ఎందుకు ఆసుపత్రికి వెళ్లారనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉండాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

రోహిత్ శర్మ కెరీర్
రోహిత్ శర్మ భారత జట్టుకు ఆఖరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కెప్టెన్‌గా ఆడారు. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ట్రోఫీ గెలుచుకుంది. ఈ ఏడాది మే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఆయన టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన టెస్ట్ కెరీర్‌లో రోహిత్ 67 మ్యాచ్‌లు ఆడి, 40.58 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ మైదానంలో రోహిత్ తిరిగి అడుగుపెట్టడం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Tuesday, September 9, 2025, 13:10 [IST]
Other articles published on Sep 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+