Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral Video: యూఏఈపై భారత్ విజయం.. పాక్ క్రికెటర్ కళ్లలో నీళ్లు!

Viral Video: ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే యూఏఈపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లోనే 9 వికెట్ల తేడాతో భారత్ గెలిచి టోర్నమెంట్‌లో తమ సత్తా చాటింది. అంతకు ముందు భారత బౌలర్లు యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. టీమిండియా విజయం పాకిస్థానీ క్రికెట్ వర్గాల్లో భయాన్ని సృష్టించింది.

పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ అసంతృప్తి
ఇండియా సాధించిన ఈ విజయం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌కు ఓ మాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న మిస్బా ఉల్ హక్.. యూఏఈపై భారత్ విజయం సాధించిన తర్వాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్ పిచ్ ఏ మాత్రం కష్టంగా లేదని, అయినా యూఏఈ జట్టు సులభంగా ఓటమిని అంగీకరించిందని ఆయన అన్నారు.

Viral Video Pakistan s Misbah-ul-Haq Appears Frustrated After India s Dominant Win Over UAE

మిస్బా ఉల్ హక్ షాకింగ్ కామెంట్స్
మిస్బా ఉల్ హక్ మాట్లాడుతూ.. "పవర్ ప్లే తర్వాత యూఏఈ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మంచి స్థితిలో ఉంది. కానీ ఆ తర్వాత జట్టు పూర్తిగా కుప్పకూలిపోయింది. మిడిల్ ఓవర్లకు వారికి ఎలాంటి ప్రణాళికా లేదు. కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌ను అర్థం చేసుకునేందుకు ఏ బ్యాటర్ కూడా ప్రయత్నించలేదు. అందరూ కేవలం హిట్టింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఔట్ అయ్యారు. పిచ్ కూడా అంతగా కష్టం లేదు" అని మిస్బా తన కళ్ల మంటతనాన్ని బయటపెట్టాడు.

పాకిస్థాన్‌కు భయం
మిస్బా ఉల్ హక్ కామెంట్స్, టీమిండియా గెలుపుపై ఆయన వ్యక్తం చేసిన ఆందోళన బట్టి చూస్తే, రాబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఆయన ఎంతగా భయపడుతున్నారో స్పష్టమవుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ లాంటి కీలక ఆటగాళ్లు లేకుండానే టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ అద్భుతమైన ఫామ్ పాకిస్తాన్ వర్గాల్లో ఆందోళనను పెంచుతోంది.

Story first published: Friday, September 12, 2025, 10:47 [IST]
Other articles published on Sep 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+