Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో: పాక్ స్పిన్నర్ చిల్లర వేశాలు.. హసరంగా స్టైలిష్ రివేంజ్

Viral Video: పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ చేసిన చిల్లర పనులకు శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. మళ్లీ ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా హసరంగా తన బౌలింగ్ తో బుద్ధి చెప్పాడు. ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్‌-4 మ్యాచ్‌లో మంగళవారం పాకిస్తాన్ శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్, శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా మధ్య జరిగిన సంఘటనలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఈ కీలక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకను పాకిస్తాన్ బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగా వికెట్‌ను అబ్రార్ అహ్మద్ తీశాడు. అనంతరం వనిందు హసరంగా స్టైల్లో అబ్రార్ అహ్మద్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. తన చేతి వేళ్లను చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీంతో అక్కడి నుంచి వనిందు హసరంగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీనికి ప్రతిగా బ్యాటింగ్‌కు వచ్చిన సైమ్ ఆయుబ్‌ను వనిందు హసరంగా బౌల్డ్ చేయగానే.. అబ్రార్ అహ్మద్ డగౌట్‌లో కూర్చొని ఉన్న వైపు చూస్తూ అబ్రార్ తరహా సెలబ్రేషన్‌ను చేసి సరదాగా పగ తీర్చుకున్నాడు. ఇది నా తడాఖా అంటూ.. హసరంగా సైగలు చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన భారతీయులు పాకిస్తాన్ వాడికి సరిగ్గా బుద్ది చెప్పావని హసరంగాను మెచ్చుకుంటున్నారు. అయితే చివరకు ఈ పోటీ అంతా మైదానంలో ఆట వరకే పరిమితమైంది.

Viral Video Pakistani Spinner s Childish Antics Met with Hasaranga s Stylish Revenge

మ్యాచ్ అనంతరం కౌగిలించుకున్న ఇద్దరు ప్లేయర్స్
మ్యాచ్ ముగిసిన అనంతరం వనిందు హసరంగా, అబ్రార్ అహ్మద్ ఇద్దరూ కలుసుకుని ఒకరికొకరు కౌగిలించుకున్నారు. నవ్వుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. వీరిద్ధరి మధ్య ఉన్న స్నేహం, క్రీడాస్ఫూర్తికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మ్యాచ్ లో ఎంత పోటీ ఉన్నప్పటికీ.. ఆట ముగిసిన తర్వాత ఆటగాళ్లు చూపించే స్నేహానికి ఓ మంచి ఉదాహరణగా నిలిచింది. మ్యాచ్ తర్వాత అబ్రార్ అహ్మద్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హసరంగాతో ఉన్న ఒక ఫోటోను స్టోరీగా షేర్ చేసి, "మంచి వ్యక్తి, మంచి బౌలర్" అని ప్రశంసించాడు. ఈ సంఘటనలు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని, క్రీడా స్ఫూర్తిని చాటిచెప్పాయి.

Story first published: Wednesday, September 24, 2025, 10:37 [IST]
Other articles published on Sep 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+