Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో: భారతీయ పాటలకు చిందేసిన పాక్ క్రికెటర్లు..!

Viral Video: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు గత కొన్ని నెలలుగా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఈ ప్రభావం క్రికెట్ మైదానంలో కూడా స్పష్టంగా కనిపించింది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో రెండు జట్లు 4 సార్లు తలపడగా.. ప్రతీసారీ భారత్ పాకిస్తాన్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లలో పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియా పట్ల ద్వేషాన్ని ప్రదర్శించిన తీరు కూడా చర్చనీయాంశమైంది. దీంతో భారత ఆటగాళ్లు టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు, వారి అభిమానుల నుంచి దూరం పాటించారు.

భారత్ అంటే ద్వేషం.. భారతీయ పాటలంటే మాత్రం ఇష్టం!
భారత్ పట్ల, భారత క్రికెట్ జట్టు పట్ల తీవ్రమైన వ్యతిరేకత చూపించే పాకిస్తాన్ ఆటగాళ్లకు భారతీయ పాటలు, సినిమాలు అంటే మాత్రం ఏ మాత్రం అభ్యంతరం లేదని తాజాగా వెల్లడైంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిజ్వాన్ తన వ్యాఖ్యల కారణంగా తరచుగా వార్తల్లో ఉంటారు. ఆయనకు భారత్ అంటే ఎంత ఇబ్బందో అందరికీ తెలిసిందే. ఈ వైరలవుతున్న వీడియో పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ గులాం పెళ్లి వేడుకకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ వేడుకకు హాజరైన మహ్మద్ రిజ్వాన్, ఇతర పాకిస్తాన్ ప్లేయర్స్ డ్యాన్స్ చేస్తుండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో భారతీయ సినిమా పాట స్పష్టంగా వినిపిస్తుంది.

Viral Video Pakistani Cricketers Dance to Indian Songs at Wedding Fans Slam Hypocrisy

భారత అభిమానుల విమర్శలు
ఈ వీడియో చూసిన భారతీయ అభిమానులు సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 'వీరికి భారత్ అంటేనే సమస్య, కానీ భారతీయ పాటలంటే ఎలాంటి అభ్యంతరం లేదా?' అని ప్రశ్నిస్తున్నారు. రిజ్వాన్‌తో పాటు ఆ వీడియోలో మరికొంత మంది పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా కనిపిస్తున్నారు.

మహిళల క్రికెట్‌లోనూ అదే ఫలితం
మహ్మద్ రిజ్వాన్ వీడియో వైరల్ అయిన రోజే.. భారత మహిళల జట్టు కూడా పాకిస్తాన్ మహిళల జట్టును వన్డే ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో ఓడించింది. ఆదివారం(అక్టోబర్ 5) కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. అన్ని రంగాల్లోనూ భారత్ చేతిలో ఓడిపోతున్నప్పటికీ, పాకిస్తాన్ ఆటగాళ్లు, అక్కడి ప్రజలు ఇప్పటికీ తమను తాము భారత్‌ కంటే గొప్పగా భావిస్తూనే.. మరోవైపు ఇలా భారతీయ పాటలను వినడం, ఆస్వాదించడం వంటివి చేయడం వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.

Story first published: Monday, October 6, 2025, 10:10 [IST]
Other articles published on Oct 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+