Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్షిత్ రాణా 'గర్ల్‌ఫ్రెండ్' జోక్ వైరల్! (వీడియో)

Harshit Rana: భారత స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఎయిర్పోర్టులో ఓ అభిమానితో సరదాగా మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరే ముందు ఎయిర్పోర్టులో తన సామానుతో లోపలికి వెళ్తున్న హర్షిత్ రాణా వద్దకు ఓ అభిమాని వచ్చి చేతిలో చెయ్యేసి ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీనిపై వెంటనే స్పందించిన హర్షిత్ రాణా.. "అరే, అరే, నేను మీ గర్ల్‌ఫ్రెండ్‌నా ఏంటి?" అని సరదాగా అడిగాడు. హర్షిత్ రాణా మాట విని అక్కడున్న కెమెరామెన్లు, ఇతరులు గట్టిగా నవ్వేశారు.

దీంతో ఆ అభిమాని వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అయితే తర్వాత హర్షిత్ రాణా అతనితో ఫోటో దిగడం జరిగింది. ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

Viral Video Harshit Rana Girlfriend Joke Goes Viral

హర్షిత్ రాణాకు టీమిండియాలో చోటు
తక్కువ సమయంలోనే హర్షిత్ రాణా టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. హర్షిత్ రాణాకు ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో మెరుపు బ్యాటింగ్‌ కూడా చేయగల సామర్థ్యం ఉంది.ఆస్ట్రేలియా పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. రాణాకు ఆస్ట్రేలియా పర్యటనలో ఎక్స్‌-ఫ్యాక్టర్‌గా నిలిచే అవకాశం ఉంది. భారత జట్టు అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. హర్షిత్ రాణా వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్న కొద్దిమంది ఆటగాళ్లలో ఒకరు.

సెలక్షన్‌పై విమర్శలు:
గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో హర్షిత్ రాణా కెరీర్ రాణించింది. హర్షిత్ రాణాకు, గంభీర్‌కు ఢిల్లీతో అనుబంధం ఉండడంతో, గంభీర్ వల్లే రాణాకు జట్టులో ప్రాధాన్యత లభిస్తోందనే విమర్శలు కూడా వచ్చాయి. మాజీ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ వంటివారు రాణా ఎంపికను గట్టిగా విమర్శించారు. ఆస్ట్రేలియా పర్యటనలో హర్షిత్ రాణా తన సత్తా చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

హర్షిత్ రాణా కెరీర్ గణాంకాలు:

టెస్టులు: 2 మ్యాచ్‌లలో 4 వికెట్లు

వన్డేలు: 5 మ్యాచ్‌లలో 10 వికెట్లు

టీ20లు: 3 మ్యాచ్‌లలో 5 వికెట్లు

ఫస్ట్‌క్లాస్: 14 మ్యాచ్‌లలో 50 వికెట్లు

Story first published: Wednesday, October 8, 2025, 10:21 [IST]
Other articles published on Oct 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+