Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral Video: గౌతమ్ గంభీర్ ఆన్ 'గ్యాంగ్‌స్టర్' మోడ్!(వీడియో)

Viral Video: ఆసియా కప్ 2025 ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్షన్, స్టేడియంలో ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణలు ఎక్కువగా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా పాక్ పేసర్ హారిస్ రౌఫ్‌పై టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహంతో కనిపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

విజేతగా భారత్.. కానీ చర్చంతా గంభీర్‌దే
ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి టీమిండియా 9వ సారి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ విజయంలో తిలక్ వర్మ(60*) కీలక పాత్ర పోషించాడు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్షన్. తిలక్ వర్మ ఫైనల్ ఓవర్లో హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన సిక్సర్‌కు గంభీర్ డగౌట్‌లో కూర్చొని ఆవేశంగా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంది.

Viral Video Gautam Gambhir Goes Gangster Mode Unseen Dugout Video

హారిస్ రౌఫ్‌తో పెరిగిన ఉద్రిక్తత
ఈ టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్‌లు మూడుసార్లు తలపడ్డాయి. సూపర్ 4 దశలో జరిగిన మ్యాచ్‌లో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత చాలా పెరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్, భారత బ్యాటర్ అభిషేక్ శర్మ మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక సందర్భంలో ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు ఢీకొనడంతో అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన జరుగుతున్న సమయంలోనే గౌతమ్ గంభీర్ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఓ వీడియో వైరల్ అయింది. గంభీర్ కోపంతో ఏదో అరుస్తూ.. నియంత్రించడం కష్టంగా కనిపించినట్లు ఆ వీడియోలో ఉంది.

ఫైనల్‌లోనూ ఉత్కంఠ
ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఉత్కంఠ పెరిగింది. గెలుపు కోసం భారత్‌కు 10 పరుగులు అవసరమైన సమయంలో శివమ్ దూబే షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయినప్పటికీ తిలక్ వర్మ సంయమనం పాటించాడు. విజయానికి ఇంకా 5 బంతుల్లో 8 పరుగులు కావాల్సినప్పుడు, తిలక్ వర్మ హారిస్ రౌఫ్ వేసిన ఫాస్ట్ బాల్‌ను స్టాండ్స్‌లోకి సిక్స్‌గా పంపాడు. ఈ సిక్సర్‌తో భారత శిబిరంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. డగౌట్‌లో కూర్చున్న గౌతమ్ గంభీర్ మొదట్లో టెన్షన్‌గా కనిపించినా.. ఒక్కసారిగా ఉప్పొంగిపోయి, సంతోషంతో బల్లపై బలంగా చరిచారు.

గంభీర్ చూపించిన ఈ శక్తి, ఉద్వేగం ఆయన్ను ఇతరుల నుంచి వేరు చేస్తాయని అభిమానులు అంటున్నారు. ఇది తన ఆటగాళ్లపై, జట్టుపై, కెప్టెన్‌పై ఆయనకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. గంభీర్ ఈ విధంగా సంబరాలు చేసుకోవడం చాలా అరుదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. క్రికెట్ స్టేడియంలో గంభీర్ భావోద్వేగ క్షణాలు వైరల్ అవుతూనే ఉంటాయి.

Story first published: Tuesday, September 30, 2025, 17:19 [IST]
Other articles published on Sep 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+