For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విషాదం: నడవలేని స్థితిలో టీమిండియా స్టార్ బ్యాటర్

Vinod Kambli: వినోద్ కాంబ్లి.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన మాజీ ప్లేయర్. లెజెండరీ బ్యాటర్. సచిన్ టెండుల్కర్ టీమ్ మేట్. స్కూల్ క్రికెట్‌లో సచిన్‌తో కలిసి 664 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పారు. తొమ్మిది సంవత్సరాల పాటు నిలకడగా సత్తా చాటిన లెఫ్ట్ హ్యాండర్.

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపించిన ఈ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తరువాత దాదాపుగా తెరమరుగు అయ్యారు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నా ఆయన సర్వీసులను ఏ రకంగానైనా వినియోగించుకోవడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు.

Viral Video Former cricketer Vinod Kambli is battling poor health conditions and struggling to walk

వినోద్ కాంబ్లి సమకాలీకులు ఏదో ఒకరకంగా లైమ్ లైట్‌లో ఉంటోన్నారు గానీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. తాజాగా వినోద్ కాంబ్లికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన ఆరోగ్య దుస్థితిని క్రికెట్ ప్రపంచానికి తెలియజేసింది. కనీసం నడవలేని దుస్థితిలో ఉన్నారాయన. పక్కన ఇద్దరు మనుషులు ఉంటే గానీ అడుగు తీసి అడుగువేయలేకపోతున్నారు.

నిలిచే ఓపిక లేక ఓ బైక్ సపోర్ట్‌గా నిల్చోవడం, ఆ తరువాత కిందపడబోతోండగా.. ఇద్దరు వ్యక్తులు చేతులతో పట్టుకుని నిల్చోబెట్టటం, భుజాలపై మోసుకుంటూ రావడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ఆయన వయస్సు కూడా పెద్దగా లేదు. 52 సంవత్సరాలే.

మద్యానికి బానిస కావడం, అనారోగ్య కారణాల వల్లే ఆయన క్రికెట్‌లో క్రియాశీలకంగా ఉండలేకపోయారనే వాదనలు లేకపోలేదు. ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించేలా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. 2013లో వినోద్ కాంబ్లి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు.

ఆ తరువాత ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇప్పుడు నిల్చోవడానికి ఇబ్బందులు పడే స్థితికి చేరారు. టెస్ట్, వన్డేల్లో కలిపి 10 వేలకు పైగా పరుగులు చేశాడు కాంబ్లి. షేన్ వార్న్ బౌలింగ్‌ను ఉతికి ఆరేసిన మొట్టమొదటి ప్లేయర్. వార్న్ బౌలింగ్‌లో 22 పరుగులు పిండుకన్నాడీ లెఫ్ట్ హ్యాండర్. 17 టెస్టుల్లో 1,084, 104 వన్డేల్లో 2,477 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, August 6, 2024, 10:26 [IST]
Other articles published on Aug 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+