జాదవ్‌తో కలిసి గోల్ఫ్:
జాదవ్‌తో కలిసి గోల్ఫ్ ఆడే సమయంలో ముఖానికి తెల్లరంగు పూసుకుని, తలకు నల్లని బంధన్ కట్టుకుని ధోనీ కనిపించాడు. దీంతో ధోనీ కొత్త లుక్‌లలో దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోను కేదార్ జాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. 'అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ గారిని గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తూ కామెంటల్ వర్షం కురిపిస్తున్నారు.

మునుపెన్నడూ చూడని గెటప్‌లో:
తాజాగా మహీ మరో కొత్త లుక్‌తో జైపూర్ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. జైపూర్‌లో ఓ వేడుకకు మహీ హాజరయ్యారు. అక్కడ తన స్నేహితులు, అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వేడుకకు హాజరై వస్తూ మీడియాకి చిక్కాడు. మహీ తలకు నల్లటి బంధన్ కట్టుకుని కనిపించారు. మునుపెన్నడూ చూడని గెటప్‌లో ఉన్న మహీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ధోనీకి దక్కని చోటు:
సొంతగడ్డపై త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ధోనీకి చోటు దక్కలేదు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ధోనీకి సెలక్టర్లు అవకాశం కల్పించలేదని సమాచారం. అయితే ధోనీ ఈ సిరీస్ కోసం తాను అందుబాటులో ఉండే విషయం బీసీసీఐతో ఏమైనా మాట్లాడారా అన్న విషయంపై సెలెక్టర్లు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

15 రోజుల పాటు విధులు:
పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకు రెండు నెలల పాటు క్రికెట్ నుంచి ధోనీ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ అనంతరం ధోనీ విధుల్లో పాల్గొన్నారు. భారత సైన్యంలో 106 టీఏ పారా బెటాలియన్‌తో కలిసి 15 రోజుల పాటు ధోనీ విధులు నిర్వహించారు. ఆర్మీ సేవ ముగిసిన అనంతరం ముంబై, జైపూర్ వెళ్లిన ధోనీ.. ప్రష్టుతం అమెరికాలో ఉన్నారు.


Click it and Unblock the Notifications












