Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గద్దలా ఎగిరిపోయాడు: అభిమానిని ఆట పట్టించిన ధోని (వీడియో)

IPL 2019: MS Dhoni Plays Again With A Fan During IPL Practice | Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఓ అభిమానిని సరదాగా ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఇంకా కేవలం ఐదు రోజులే మిగలుండటంతో ఇప్పటికే ఆయా ఆటగాళ్లు జట్టుతో కలిశారు.

చిదంబరం స్టేడియంలో

చిదంబరం స్టేడియంలో

దీంతో ప్రాంఛైజీలు ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ధోని ప్రాక్టీస్‌ చేస్తుండగా ఓ అభిమాని సరాసరి మైదానంలోకి ప్రవేశించి ధోని వద్దకు పరిగెత్తాడు.

అభిమానిని ఆట పట్టించిన ధోని

అభిమానిని ఆట పట్టించిన ధోని

దీంతో ఆ అభిమాని ధోని వద్దకు వచ్చే సరికి పక్కనే ఉన్న సీఎస్కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ వెనుకన దాక్కుని ‘నన్ను పట్టుకో' అన్నట్టు ఆ అభిమానిని ఆటపట్టించాడు. లక్ష్మీపతి బాలాజీ చుట్టూ తిరిగిన తర్వాత ధోని దూరం పరిగెత్తినా అభిమాని ఆగకుండా వెంట పడ్డాడు. అదే సమయంలో మైదానంలో ఉన్న సిబ్బంది వెంటనే ఆ అభిమానిని పట్టుకుని పక్కకు లాక్కెళ్లారు.

చివరకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన ధోని

చివరికి అభిమానికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ధోని నవ్వుకున్నాడు. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ఐపీఎల్ 2019 సీజన్‌ మొదటి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Story first published: Monday, March 18, 2019, 16:09 [IST]
Other articles published on Mar 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+