
హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ సహా యజమాని షారుక్ ఖాన్... చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో మాట్లాడుతోన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఇది ఐదో విజయం కావడం విశేషం.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తున్న ధోని, స్టాండ్స్‌లో నిలబడి ఉన్న షారుక్ ఖాన్ పరస్పరం నవ్వుతూ పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. అంతేకాదు "తలా, చెన్నై ఎక్స్‌ప్రెస్ సూపర్" అంటూ కామెంట్ కూడా పోస్టు చేసింది.
ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, సీఎస్‌కే కెప్టెన్ ధోనిని అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాక్సీఫీసు రికార్డులను బద్దలు కొట్టింది.
మోరవైపు షారుక్ ఖాన్ సైతం చెన్నై నుంచి ముంబై వెళ్తూ విమానంలో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. "ముంబై వెళ్లడానికి తిరుగు ప్రయాణంలో ఉన్నాను. ఈ సెల్ఫీ దిగడానికి ప్రత్యేక కారణాలేమి లేవు. దక్షిణాదిలోని నా సినీ మిత్రులకు, క్రీడా మైదానంలోని క్రికెట్ అభిమానులకు గుడ్‌బై" అంటూ కామెంట్ పెట్టాడు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. అనంతరం 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ డుప్లెసిస్ 45 బంతుల్లో43(3 ఫోర్లు) చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.