సన్‌రైజర్స్ మ్యాచ్‌కు పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్?
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. లీగ్ దశ ముగియడానికి మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరగా మారింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అద్భుతమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అందరూ ఒకే చోట కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేయడం కనిపిస్తుంది. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ దృశ్యం కనిపించినట్లుగా ఆ వీడియో ఉంది.
స్టార్ హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒకరితో ఒకరు నవ్వుతూ, చప్పట్లు కొడుతూ స్టేడియంలో సందడి చేస్తున్న ఈ దృశ్యం చూసి ఇది నిజమేనని చాలా మంది నమ్మారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం దీనిపై ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఇది నిజమైన వీడియో కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన వీడియో అని స్పష్టమైంది.

టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏఐ సాయంతో అసాధ్యమైన విషయాలను కూడా సుసాధ్యం చేస్తున్నారు. నిజానికి ఈ హీరోలందరూ ఒకే చోట కలవడం చాలా అరుదు. కానీ ఏఐ పుణ్యమా అని వారి అభిమాన హీరోలందరినీ ఒకేసారి ఇలా చూడడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. "ఇది నిజం కాకపోయినా, చూడటానికి మాత్రం చాలా బాగుంది" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications