For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs LSG: ఐపీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు.. ఎవరు ఇతడు?

DC vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. 20 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ విప్రజ్ నిగమ్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఓటమి అంచున నిలబడిన జట్టును గెలిపించేందుకు మెరుపు ఇన్నింగ్స్ ఆడి శభాష్ అనిపించుకుంటున్నాడు.

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కేవలం ఒక వికెట్ తేడాతో ఊహించని విజయాన్ని సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఒక దశలో(65/5) తడబడింది. కానీ దీని తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు. ఢిల్లీ సాధించిన ఈ ప్రత్యేక విజయంలో అశుతోష్ శర్మ స్టార్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మరొక ఆటగాడు ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలుపు అంచుకు తీసుకెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. అతను బ్యాటుతోనూ, బంతితోనూ తన వంతు సహకారాన్ని అందించాడు. ఆ ఆల్‌రౌండర్ మరెవరో కాదు ఈ విప్రజ్ నిగమ్. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ లోనే అదరగొట్టేశాడు.

Vipraj Nigam Shines in IPL Debut Guides Delhi to Thrilling Victory

తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే మెరిసిన విప్రజ్ నిగమ్
20 ఏళ్ల యువ ఆల్ రౌండర్ విప్రజ్ నిగమ్ తన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. విప్రజ్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చినప్పుడు ఢిల్లీ గెలవడం దాదాపు అసాధ్యం. అశుతోష్ శర్మ మరో చివర నిలబడి ఉన్నాడు. అశుతోష్ కు ఆ సమయంలో మరొకరి మద్దతు అవసరం. విప్రజ్ నిగమ్ అతనికి బాగా మద్దతు ఇచ్చాడు. విప్రజ్ వచ్చిన వెంటనే తన విధ్వంసకర బ్యాటింగ్ ను ప్రారంభించాడు. ఇది అశుతోష్ శర్మ మనోధైర్యాన్న కూడా పెంచింది. విప్రజ్ నిగమ్ మ్యాచ్ ను పూర్తి చేయలేకపోవచ్చు కానీ అశుతోష్ శర్మకు చక్కటి మద్దతు లభించింది.

విప్రజ్ నిగమ్ 15 బంతులను ఎదుర్కొని 39 పరుగులు సాధించాడు. 260 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో అతని బ్యాట్ నుంచి ఐదు ఫోర్లు, రెండు అద్భుతమైన సిక్సర్లు వచ్చాయి. ఇదే కాకుండా బౌలింగ్ లో కూడా విప్రజ్ నిగమ్ ఐడెన్ మార్‌క్రమ్ వంటి కీలక వికెట్ తీసుకున్నాడు. ఈ ఆటగాడు తన తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న తలెత్తడం సాధారణం. ఇంతకీ ఈ ఆటగాడు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చాడు? అనే ప్రశ్నలు రావచ్చు. విప్రజ్ నిగమ్ గురించి తెలుసుకుందాం.

విప్రజ్ నిగమ్ ఎవరు?
ఉత్తరప్రదేశ్ కు చెందిన విప్రజ్ నిగమ్ ను గత సంవత్సరం ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ యువ ఆల్ రౌండర్ తొలిసారిగా యూపీ టీ20 2024 సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడ విప్రజ్ యూపీ ఫాల్కన్స్ తరఫున 12 మ్యాచ్ లు ఆడి.. 11.15 స్ట్రైక్ రేట్, 7.45 ఎకానమీతో 20 వికెట్లు పడగొట్టాడు. ఉత్తరప్రదేశ్ తరఫున అన్ని ఫార్మాట్లలో అరంగేట్ర చేయడంతో అతని దేశీయ కెరీర్ ప్రారంభమైంది. 2024-25 సీజన్ లో విప్రజ్ నిగమ్ మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, ఐదు లిస్ట్ -ఏ మ్యాచ్ లు, 7 టీ20లు ఆడి.. 103 పరుగు చేసి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.

2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కూడా విప్రజ్ నిగమ్ ప్రతిభ కనిపించింది. విప్రజ్ ఏడు కంటే కొంచెం ఎక్కువ ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. ఆంధ్రాపై 157 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి విప్రజ్ రింకూ సింగ్ తో కలిసి ఎనిమిది బంతుల్లో 27 పరుగులు చేశాడు. విప్రజ్ నిగమ్ ప్రధానంగా బౌలర్. కానీ అతను బ్యాటింగ్ లో భారీ షాట్స్ ఆడగలడు. దీనికి ఉదాహరణను లక్నోతో మ్యాచ్ లో చూశాం.

Story first published: Tuesday, March 25, 2025, 9:16 [IST]
Other articles published on Mar 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+