
కుంబ్లే ఉత్తమ కోచ్:
బుధవారం వినోద్ రాయ్ మాట్లాడుతూ... 'అనిల్ కుంబ్లే ఒక ఉత్తమ కోచ్. కుంబ్లే పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటే బలవంతంగానైనా అతన్నే కొనసాగించేవాడిని. కుంబ్లే పట్ల నాకు చాలా గౌరవం ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా కుంబ్లేను కొనసాగించే అవకాశం నా చేతుల్లో లేదు. కుంబ్లేతో డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీకి అభిప్రాయ బేధాలు తలెత్తడంతో కోచ్‌ను మార్చాల్సి వచ్చింది. సీఏసీలో సభ్యులైన సచిన్, గంగూలీలతో కోహ్లీ సుదీర్ఘ చర్చల తర్వాత కోచ్‌ను మార్చాలని పట్టుబట్టడంతో కుంబ్లేకు వేటు తప్పలేదు' అని తెలిపారు.

స్వచ్ఛందంగా తప్పుకున్నాడు:
'కోహ్లీతో విబేధాల కారణంగా కుంబ్లేనే స్వచ్ఛందంగా కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. వివాదాన్ని మరింత పెద్దది చేయడం కుంబ్లేకి ఇష్టం లేక.. గౌరవంగా తన పదవికి రాజీనామా చేసాడు. ఆ సమయంలో కోహ్లీ ముంబైలో ఉండగా.. నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఫోన్ ద్వారా కుంబ్లే విషయాన్ని చెప్పాడు. కుంబ్లేను కొనసాగించడానికి కోహ్లీ ఆసక్తిగా లేడనే విషయాన్ని సచిన్, గంగూలీకి చెప్పా. ఇద్దరు కోహ్లీతో మాట్లాడారు. అయినా ఫలితం లేకపోయింది. కుంబ్లే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది' అని రాయ్ పేర్కొన్నారు.

గంగూలీ కూడా కుంబ్లేను కొనసాగించేవాడు:
'అలాంటి పరిస్థితుల్లో కుంబ్లేను కోచ్‌గా కొనసాగించే అవకాశం నా చేతుల్లో లేకపోయింది. ఒకవేళ ఉండి ఉంటే కచ్చితంగా కుంబ్లేను కోచ్‌గా కొనసాగించేవాడిని. ఇప్పుడైతే కుంబ్లేను బలవంతంగానైనా కోచ్ పదవిలో గంగూలీ కొనసాగించేవాడు. ఇలాంటి వివాదమే మిథాలీ రాజ్, రమేశ్ పవార్‌ల మధ్య జరిగింది. ఇవన్నీ బీసీసీపై అపవాదను తెచ్చిపెట్టాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ రావడంతో మళ్లీ అలాంటి వివాదాలు రావనే నేను అనుకుంటున్నా' అని రాయ్ ధీమా వ్యక్తం చేశారు.

గంగూలీ కన్నా బెటర్ వ్యక్తి ఎవరూ లేరు:
'రాజ్యాగం ప్రకారం బీసీసీఐలో ఎన్నికలు నిర్వహించాం. అది మా బాధ్యత. సంతృప్తికరంగానే బీసీసీఐని వీడుతున్నాం. గంగూలీకి అభినందనలు. అతని పట్ల ఎంతో గౌరవం ఉంది. దాదా ఉత్తమ కెప్టెన్. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించాడు. బీసీసీఐని కూడా అదే దారిలో నడుపుతాడనే నమ్మకం ఉంది. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు గంగూలీ కన్నా బెటర్ వ్యక్తి ఎవరూ లేరు' అని రాయ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












