Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ మంచి నిర్ణయం: ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు రద్దు, పాక్‌తో మ్యాచ్‌పై రాని స్పష్టత

ICC Cricket World Cup 2019 : BCCI To Consult Govt On Pak World Cup Tie Says Vinod Rai | Oneindia
Vinod Rai: BCCI to consult govt on World Cup match against Pakistan; IPL opening ceremony cancelled

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై యావత్ భారతవనిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌లో పాక్‌తో భారత మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడాలా వద్దా అన్న అంశంపై చర్చించడానికి శుక్రవారం బీసీసీఐ, సీఓఏ సమావేశమైంది. ఈ సమావేశానికి సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ అధ్యక్షత వ్యవహారించారు. ఈ సమావేశం అనంతరం వినోద్ రాయ్ మీడియాతో మాట్లాడారు.

భారత్-పాక్ మ్యాచ్‌పై

భారత్-పాక్ మ్యాచ్‌పై

భారత్-పాక్ మ్యాచ్‌పై వినోద్ రాయ్ మాట్లాడుతూ "మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. జూన్ 16 మ్యాచ్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఐసీసీకి ప్రధానంగా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాం. టోర్నీ సందర్భంగా ఆటగాళ్లకు మరింత భద్రత కల్పించాలని, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దేశాలతో సంబంధాలు తెంపుకోవాలని ఐసీసీని కోరుతున్నాం. హోంమంత్రి వ్యాఖ్యలపై నేనేమీ స్పందించను. జూన్ 16కు ఇంకా చాలా రోజులు ఉంది" అని అన్నారు.

ఐపీఎల్‌కే ప్రత్యేక ఆకర్షణగా

ఐపీఎల్‌కే ప్రత్యేక ఆకర్షణగా

ఐపీఎల్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ ప్రకటించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల గౌరవార్థం ఐపీఎల్ వేడుకలు రద్దుచేశామని ఆయన తెలిపారు. ఆరంభ వేడుకలకు కార్యక్రమానికి కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందిస్తామని బీసీసీఐ క్రికెట్‌ పాలకుల కమిటీ ఈ సమావేశంలో నిర్ణయించింది.

పీఎల్‌ ఆరంభ వేడుకలు రద్దు

పీఎల్‌ ఆరంభ వేడుకలు రద్దు

"ఈ సారి ఐపీఎల్‌ ఆరంభ వేడుక నిర్వహించడం లేదు. అందుకు కేటాయించిన డబ్బును అమరుల కుటుంబాలకు అందజేస్తాం" అని వినోద్‌ రాయ్‌ తెలిపారు. వాస్తవానికి అమర జవాన్ల కుటుంబాలకి రూ. 5 కోట్లు తగ్గకుండా బీసీసీఐ తరఫున ఆర్థిక సాయం అందించేందుకు అనుమతించాలని వినోద్ రాయ్‌కి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా లేఖ రాశాడు.

అమరుల కుటుంబానికి ఎక్కువ మొత్తాన్ని

అమరుల కుటుంబానికి ఎక్కువ మొత్తాన్ని

దీనిపై శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించిన బోర్డు సభ్యులు.. అంతకంటే ఎక్కువ మొత్తాన్నే ఇచ్చేందుకు అంగీకరించారు. 2018 ఐపీఎల్ సీజన్ ఆరంభోత్సవానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బడ్జెట్‌లో రూ.50 కోట్లను తొలుత కేటాయించగా.. ఆ మొత్తాన్ని రూ.30 కోట్లకి బీసీసీఐ పాలకుల కమిటీ తగ్గించింది. గతేడాది ఈ మొత్తాన్ని రూ.20 కోట్లకు తగ్గించింది.

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టోర్నీ నిర్వాహకులు రెండు వారాల షెడ్యూలును మాత్రమే విడుదల చేశారు. 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ని బీసీసీఐ తన ట్విట్టర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, February 22, 2019, 18:35 [IST]
Other articles published on Feb 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+