'విడాకులకు అప్లై చేశా.. పాపం అని మళ్లీ వెనక్కి తగ్గా'-క్రికెటర్ భార్య షాకింగ్ కామెంట్స్
అనారోగ్యంతో బాధపడుతోన్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అతడి భార్య ఆండ్రియా షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఓ దశలో భర్త కాంబ్లీ నుంచి తాను విడిపోవడానికి సిద్ధమైనట్లు గుర్తు చేసుకున్న ఆండ్రియా.. విడాకులు కూడా దరఖాస్తు చేసినట్లు పేర్కొంది. కానీ అతడి అనారోగ్యం చూసి బాధతో మళ్లీ మనసు మార్చుకున్నట్లు వెల్లడించింది.
"నేను వదిలేస్తే అతడు నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. అతడు చిన్నపిల్లాడి లాంటి వాడు. అది నన్నెంతో బాధిస్తుంది. ఎంతగానో బాధపెడుతుంది. నేను స్నేహితులనే విడిచిపెట్టాను. అలాంటిది అతడు అంతకన్నా నాకెక్కువ. అతడి నుంచి నేను దూరంగా జీవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు నేను చాలా బాధపడేదానిని. అతడు తిన్నాడా? లేడా?, నిద్రపోతున్నాడా లేదా?, అసలు బాగానే ఉన్నాడా? అని తెగ ఆలోచించేదానిని. ఆ తర్వాత అతడి పరిస్థితి చూసి నాకర్థమైంది. నా అవసరం అతనికి ఎంతో ఉందని." అని చెప్పుకొచ్చింది.

గతంలో ఓ సారి కాంబ్లీపై పోలీసు కేసు కూడా పెట్టింది ఆండ్రియా. తనను కాంబ్లీ దుర్భాషలాడటంతోపాటు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో కాంబ్లీ కుకింగ్ పాన్‌ను విసిరి కొట్టడంతో తన తలకు దెబ్బ తగలిగిందని కంప్లైంట్ లో పేర్కొంది. దీంతో ముంబయి పోలీసులు కాంబ్లీపై అప్పట్లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.
కాంబ్లీ - ఆండ్రియా 2000 సంవత్సరంలో కలుసుకున్నారు. ఆండ్రియా మోడల్, ఫ్యాషన్ డిజైనర్. అయితే వీరిద్దరు 6 ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. ఆ తర్వాత 2006లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇకపోతే తీవ్ర అస్వస్థతతో ఆ మధ్య ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. రీసెంట్ గానే తన చిన్ననాటి స్నేహితుడు, మాజీ సహచరుడు సచిన్ తెందూల్కర్ తో పాటు తనకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు చెప్పాడు కాంబ్లీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications