Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ Vs కాంబ్లీ: 'ఫ్యామిలీ సపోర్ట్ లేక కనుమరుగయ్యాడు'

ముంబై: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పోలిస్తే అతని స్నేహితుడు, టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీనే ప్రతిభగల ఆటగాడని 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. కాగా అతడికి సరైన మద్దతు లేకపోవడం వల్లనే క్రికెట్‌లో రాణించలేకపోయాడని కపిల్ అన్నాడు.

ముంబైలో విజయవంతమైన క్రీడాకారుల తల్లిదండ్రుల సత్కార కార్యక్రమానికి హాజరైన కపిల్ దేవ్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న క్రీడాకారులు స్టార్లుగా ఎదగడంలో కుటుంబ సహకారం ఎంతో కీలకమని ఈ సందర్భంగా చెప్పాడు. క్రికెట్‌ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌, అతడి స్కూల్‌ మేట్‌, స్నేహితుడైన వినోద్‌ కాంబ్లీలను ఈ సందర్భంగా కపిల్‌ పోల్చాడు.

Vinod Kambli was more talented than Sachin Tendulkar, says Kapil Dev

'సచిన్‌, కాంబ్లీ ఇద్దరూ సమాన ప్రతిభగల ఆటగాళ్లు. వాస్తవానికి కాంబ్లీలోనే టాలెంట్‌ ఎక్కువ. కానీ వినోద్‌ పెరిగిన వాతావరణం, కుటుంబ సభ్యుల మద్దతు, స్నేహితుల విషయంలో సచిన్‌‌కు పూర్తిగా భిన్నమ'ని కపిల్‌ చెప్పాడు. దాని ప్రభావమే వారిద్దరి క్రీడా జీవితంపై పడిందని చెప్పుకొచ్చాడు.

సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తే, చిన్న వయసులోనే అద్భుతాలను చేసిన కాంబ్లీ ఆ తర్వాత కాలంలో కనుమరుగయ్యాడని గుర్తు చేశాడు. సచిన్‌ టెండూల్కర్ ఓ ప్రతిభగల క్రికెటర్‌గా ఎదగడంలో కుటుంబం పాత్ర ఎంతో ఉందన్నాడు. తల్లిదండ్రులు తమ కోరికలను పిల్లలపై రుద్దడాన్ని కపిల్ తప్పుబట్టాడు. పిల్లల ఆశలకు అనుగుణంగా తల్లిదండ్రులు నడుచుకోవాలని కపిల్ పిలుపునిచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+