ట్విట్టర్‌లో కాంబ్లీ "అసంబద్ధ" వ్యాఖ్యలు: ఫ్యాన్స్ ఆగ్రహాం, క్షమాపణ (ట్వీట్స్)
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చిక్కుల్లో పడ్డారు. భారత క్రికెట్ అభిమానులు అగ్రహానికి గురయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళ వారం రాత్రి రాజస్ధాన్ రాయల్స్ Vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గురించి వినోద్ కాంబ్లీ అధికారిక ట్విట్టర్ హ్యాండ్లర్ నుంచి "అసంబద్ధమైన" ట్వీట్స్‌ను ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్స్‌ను ట్వీట్ చేసింది తాను కాదని, ఇలా జరిగింనందుకు గాను తనని క్షమించాల్సిందిగా బుధవారం కోరాడు. అసలేం జరిగిందంటే, రాజస్ధాన్ రాయల్స్ Vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ హిందీ కామెంటరీని సోనీ మ్యాక్స్ టీవి అందిస్తోంది. సోనీ మ్యాక్స్ టీవీలో వ్యాఖ్యాతలుగా నవజ్యోత్ సింగ్ సిద్ధు, రమీజ్ రాజా, పాకిస్ధాన్‌కు చెందిన షోయబ్ అక్తర్‌లు వ్యవహారిస్తున్నారు.

వారి హిందీ కామెంటరీపై కాంబ్లీ ట్విట్టర్ హ్యాండ్లర్‌లో "అసంబద్ధమైన" ట్వీట్స్ వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అభిమానులు కాంబ్లీని వరుస ట్వీట్స్‌తో ఉతికేశారు. వీటిలో కొన్నింటికి రిప్లై ఇచ్చిన వినోద్ కాంబ్లీ చివరకు వాటిని తొలగించేశాడు.
"ఆ తర్వాత ట్వీట్స్ నేను చేసినవి కావు. ఎవరైతే నా ఫోన్ తీసుకుని ట్వీట్స్ చేశాడో అతని తరుపున నేను క్షమాపణలు చెబుతున్నాను. అతన్ని తీసివేశాను. అందరూ నన్ను క్షమించండి" అంటూ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications