
హైదరాబాద్: ప్రాణ స్నేహితులైనటువంటి భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వినోద్ కుంబ్లేల మధ్య ఉన్న స్నేహం గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ బాల్యం నుంచి ప్రముఖ క్రికెట్ గురువు రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. టీమిండియా తరఫున తమ క్రికెట్ కెరీర్‌ను దాదాపు ఒకే సమయంలో ఆరంభించారు.
సచిన్ తన అసాధారణ ప్రతిభతో సుధీర్ఘ కాలం క్రికెట్ ఆడగా వినోద్ కుంబ్లే మాత్రం మధ్యలోనే వెనుదిరిగాడు. అయితే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహానే కారణమని తాజాగా కుంబ్లే వెల్లడించారు.
'నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తదుపరి భవిష్యత్ కార్యచరణపై సందిగ్ధంలో ఉన్నాను. వ్యాఖ్యానం చేయాలా?లేదా టెలివిజన్ ఎక్స్‌పర్ట్ అవ్వాలా? అనే నిర్ణయించుకోలేక పోయాను. కానీ నాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం కనుక మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నా' అని బాంద్రా కుర్లాలో క్రికెట్ కోచింగ్ అకాడమీని ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో కుంబ్లే ఈ విషయం చెప్పారు.
'సచిన్ టెండూల్కర్‌కు బాగా తెలుసు నేను క్రికెట్‌ను ఎంతగా ఆరాధిస్తానో. అందుకే, నన్ను క్రికెట్ కోచింగ్ అకాడమీని ఎందుకు ప్రారంభించకూడదని సచిన్ సూచించాడు' అని తన ప్రాణ స్నేహితుడ్ని వినోద్ గుర్తు చేసుకున్నారు. ఆ కారణంగానే ప్రస్తుతం సచిన్ చూపిన మార్గంలో తాను పయనిస్తూ అకాడమీ ప్రారంభించానన్నారు.
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఘనత కుంబ్లేకు ఉంది. తనను మళ్లీ ఫీల్డ్‌లోకి తీసుకొచ్చిన ఘనత మాత్రం సచిన్‌దే. అచ్రేకర్ సర్ నుంచి మేం నేర్చుకున్న పాఠాలను ముందు తరం ఆటగాళ్లకు నేర్పేందుకు సమయం వచ్చిందని తాను అనుకుంటున్నానన్నారు. యువ క్రికెటర్లు దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఇది గొప్ప విషయమని కుంబ్లే అభిప్రాయపడ్డారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.