Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అచ్చం జాండీ రోడ్స్‌లా గాల్లో ఎగురుతూ వినయ్ రనౌట్ (వీడియో)

Vinay Kumar does a Jonty Rhodes in Syed Mushtaq Ali T20 - Watch video

హైదరాబాద్: జాంటీ రోడ్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మాజీ ఆటగాడు 1992 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంజమామ్‌ ఉల్‌ హాక్‌ను ఔట్‌ చేసిన తీరు ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి ఇప్పటికీ కళ్లు ముందు మెదులుతూనే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో బంతి అందుకున్న జాంటీ రోడ్స్ గాల్లో తేలుకుంటూ వికెట్లను కొట్టిన తీరు ఓ అద్భుతం.

తాజాగా, జాంటీ రోడ్స్ లాగా భారత ఆటగాడు వినయ్‌ కుమార్‌ కూడా తన ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ఔట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వినయ్ కుమార్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు 'నా ఔట్‌ ఎలా ఉంది అంటూ' వినయ్‌ కుమార్ జాంటీ రోడ్స్‌ని ట్విట్‌లో అడిగాడు.

'హాయ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌. 1992 వరల్డ్ కప్‌లో ఇంజమామ్‌ ఉల్‌ హాక్‌ను నువ్వు ఔట్‌ చేసిన వీడియోను నేను ఇప్పటికి ఎన్నోసార్లు చూశాను. ఏదో ఒక రోజు నాకు ఇలా ఔట్‌ చేసే అవకాశం వస్తుందని వేచి ఉన్నాను. ఈ రోజు ఆ అవకాశం వచ్చింది. ఇదిగో చూడు. ఎలా ఉందో చెప్పు' అంటూ వినయ్ ట్వీట్ చేశాడు.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వినయ్ కుమార్ ఈ రనౌట్ చేశాడు. ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు జాంటీ రోడ్స్‌ కోచ్‌గా వ్యవహరించిన సమయంలోనే వినయ్‌ కుమార్ ఆ జట్టు తరుపున ఆడాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 19:04 [IST]
Other articles published on Jan 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+