For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup:: ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా పంపాలనే నిర్ణయం వారిదే: విక్రమ్ రాథోర్

Vikram Rathour says Whole Indian management took the call to send Ishan Kishan as an opener vs NZ
T20 World Cup : Rohit Sharma విషయం లో వల్లే అలా సమర్ధించారు..! - Vikram Rathour || Oneindia Telugu

దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. దాంతో ప్రస్తుతం సెమీ ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యం. ముఖ్యంగా న్యూజీలాండ్ జట్టుపై ఓటమి తర్వాత ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. టీమ్ మేనేజ్‌మెంట్‌పై క్రికెట్ నిపుణులు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న ఏమిటంటే.. రోహిత్ శర్మను ఓపెనింగ్ నుంచి ఎవరు తొలగించారు?. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇషాన్ కిషన్‌ను భారత్ ఎందుకు ఓపెనింగ్‌కు పంపింది. చాలా మంది మెంటార్ ఎంఎస్ ధోనీనే ఈ నిర్ణయం తీసుకున్నాడని అందరూ అనుకున్నారు. తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 ఆ ఆలోచన మహీదే:

ఆ ఆలోచన మహీదే:

రోహిత్ శర్మను ఓపెనింగ్ నుంచి తొలగించాలనే ఆలోచన మెంటార్ ఎంఎస్ ధోనీదే అంట. ఇషాన్ కిషన్‌తో ఓపెనింగ్ చేయించి, రోహిత్ శర్మను 3వ స్థానంలో దింపాలనే ఆలోచన మొదట ధోనీ వెల్లడించాడంట. ఆ తర్వాత జట్టు మొత్తం అంగీకరించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా ధోనీ అభిప్రాయాన్ని సమర్థించడంతో రోహిత్‌ను నంబర్ 3లో పంపించారట. ఇందుకు రోహిత్ కూడా ఒకే చెప్పాడట. ఇదే విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మంగళవారం వెల్లడించాడు.

రోహిత్ కూడా ఒకే అన్నాడు:

రోహిత్ కూడా ఒకే అన్నాడు:

'న్యూజిలాండ్‌తో మ్యాచుకు ముందు సూర్యకుమార్ యాదవ్‌కు వెన్ను నొప్పి వచ్చింది. అతడికి మ్యాచ్‌కు సరిపోయే ఫిట్‌నెస్‌ లేదు. దాంతో ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపాలని మొత్తం యాజమాన్యం పిలుపునిచ్చింది. రోహిత్ శర్మ కూడా ఇందులో భాగమే. ఐపీఎల్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఇషాన్ ఓపెనర్‌గా బాగా రాణించాడు. అందుకే అతన్ని ఓపెనర్‌గా పంపారు. అందుకే రోహిత్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు' అని భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ తెలిపాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ప్రణాళికలను అమలు చేయకపోవడం తమపై ప్రభావం చూపిందని రాథోర్ అభిప్రాయపడ్డాడు.

4 పరుగులకే పెవిలియన్‌కు:

4 పరుగులకే పెవిలియన్‌కు:

ఓపెనింగ్‌ చేసిన ఇషాన్ కిషన్ 8 బంతులు మాత్రమే ఆడి కేవలం 4 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇషాన్ ఓ బౌండరీ బాది ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ కూడా కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు. ఓ లైఫ్ లభించినా దాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాట్ నుంచి ఎలాంటి పరుగులు రాలేదు. భారీ షాట్లు ఆడుతూ భారత టాప్ ఆర్డర్‌లోని నలుగురు బ్యాటర్లు ఔట్ అయ్యారు. టీ20 ప్రపంచకప్‌ 2021కు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెంటార్‌గా నియమించారనే సంగతి తెలిసిందే. మహీ రాకతో ప్రతి ఒక్కరూ భారత జట్టుపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ధోనీ రాక భారత జట్టుకు ఎలాంటి ప్రయోజనాన్ని చూపలేదు.

ఆఫ్ఘనిస్థాన్‌తో తదుపరి మ్యాచ్:

ఆఫ్ఘనిస్థాన్‌తో తదుపరి మ్యాచ్:

మెగా టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోయింది. పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోగా.. కివీస్‌పై 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమిండియా ప్రస్తుతం సెమీ ఫైనల్ చేరడం దాదాపు అసాధ్యంగా మారింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌ని అబుదాబిలో బుధవారం (అక్టోబర్ 3) ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. అఫ్ఘాన్ జట్టు ఫామ్‌లో ఉండటంతో పాటు మూడు మ్యాచ్‌లకు గాను రెండింట్లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్ కూడా భారత జట్టుకు కష్టతరంగా మారనుంది.

Story first published: Tuesday, November 2, 2021, 22:51 [IST]
Other articles published on Nov 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+