Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెదర్లాండ్స్ తరఫున ఆకట్టుకున్న విజయవాడ క్రికెటర్.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ, ఓడిన నెదర్లాండ్స్

Vijayawada Born Cricketer Teja Nidamanuru debut in Netherlands Team Against Westindies match

షాయ్ హోప్ అజేయ సెంచరీతో చెలరేగడంతో నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్‌పై వెస్టిండీస్ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 45ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. డక్ వర్గ్ లూయిస్ పద్ధతి ద్వారా నెదర్లాండ్స్.. వెస్టిండీస్ ముందు 247 లక్ష్యాన్ని నిర్దేశించింది. నెదర్లాండ్ ఓపెనర్లు 12ఓవర్లలో 63పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత సంతతికి చెందిన విక్రమ్‌జిత్ సింగ్ 45బంతుల్లో 47పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు తలా కొంత చేయి వేసి ఇన్నింగ్స్ నడిపించారు. ఇక తెలుగు తేజం తేజ నిడమనూరు తొలి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 51బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 58పరుగులు చేశాడు. తద్వారా నెదర్లాండ్స్ జట్టు స్కోరు 45ఓవర్లలో 240/7కు చేరుకుంది, తర్వాత డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. వెస్టిండీస్ ముందు 247టార్గెట్ నివేదించబడింది.

ఇక టార్గెట్ ఛేదనలో వెస్టిండీస్ జట్టు 11 డెలివరీలు మిగిలి ఉండగానే ఛేజింగ్‌ పూర్తి చేసింది. ఓపెనర్ షాయ్ హోప్ (130బంతుల్లో 119), మరో ఓపెనర్ షమర్ బ్రూక్స్ (67 బంతుల్లో 60)తో కలిసి 120పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక హోప్ వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్ తరపున తన 11వ సెంచరీని నమోదు చేశాడు. అయితే వెస్టిండీస్ మధ్యలో మూడు వికెట్లు త్వరత్వరగా కోల్పోవడంతో ఛేదనలో కాస్త తడబడింది. కానీ షాయ్ హోప్ చివరి వరకు క్రీజులో ఉండి.. మరో బ్యాటర్ బ్రాండన్ కింగ్ (51 బంతుల్లో 58 నాటౌట్)తో కలిసి 116పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసి గెలిపించాడు. సెంచరీతో హోప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నెదర్లాండ్ బౌలర్లలో అకేల్ హోసేన్ తన తొమ్మిది ఓవర్లలో కేవలం 29పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. జూన్ 2న రెండో, జూన్ 4న మూడో వన్డేలు జరుగుతాయి. వెస్టిండీస్ ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉంది.

ఇకపోతే ఈ మ్యాచ్‌లో మన ఆంధ్రకుర్రాడు తేజా నిడమనూరు ఆకట్టుకున్నాడు. విజయవాడకు చెందిన అనిల్ తేజ నిడమనూరు క్రికెట్ మీద అమితంగా ఆసక్తి కనబరిచేవాడు. అతను న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. ఇక 27ఏళ్ల క్రికెటర్.. తదనంతరం నెదర్లాండ్స్ వెళ్లి అక్కడ జాతీయ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన తేజ.. తొలి మ్యాచ్‌లోనే 58పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భవిష్యత్తులో మంచి ప్లేయర్ కాగలననే నమ్మకాన్ని ఇచ్చేలా తేజా నిడమనూరు ధాటిగా ఆడి.. నెదర్లాండ్స్ స్కోరును 58పరుగులకు చేర్చాడు.

Story first published: Wednesday, June 1, 2022, 14:51 [IST]
Other articles published on Jun 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+