కివీస్‌తో నేడు తొలి వార్మప్ మ్యాచ్: విజయ్ శంకర్‌కు గాయం?

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్‌కి సిద్ధమైంది. ఇంగ్లీషు పిచ్‌లపై తమ బలాబలాలను పరీక్షించుకునేందుకు ఇండియా, న్యూజిలాండ్ జట్లు సిద్దమయ్యాయి. ఓవల్ వేదికగా జరిగే తమ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రాక్టీస్ మ్యాచ్‌లో అందరి దృష్టీ
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అందరి దృష్టీ నాలుగో స్థానం కోసం పోటీపడుతున్న రాహుల్, విజయ్ శంకర్‌లపైనే ఉంది. ఈ మెగా టోర్నీలో టైటిల్ ఫేవరేట్ జట్లో ఒకటిగా ఉన్న టీమిండియా ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో 15 మంది ఆటగాళ్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది.

నాలుగో స్థానంలో తీవ్ర చర్చ
ముఖ్యంగా నాలుగో స్థానంలో తీవ్ర చర్చ సాగిన నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ దీనిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎవరికీ విశ్రాంతినివ్వకుండా బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరినీ పరీక్షించనుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు రోజు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

విజయ్ శంకర్ కుడి చేతికి గాయం
శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కుడి చేతికి గాయమైంది. పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని పుల్ చేసే క్రమంలో శంకర్ గాయపడ్డాడు. దీంతో నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అనంతరం గాయాన్ని నిర్ధారించిన టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి స్కానింగ్ చేయించింది.

కేదార్ జాదవ్ కూడా
వైద్యుల నివేదిక వచ్చిన తర్వాత న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయ్ శంకర్ ఆడే విషయమై ఓ నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. మరోవైపు ఐపీఎల్‌లో గాయపడిన కేదార్ జాదవ్ శుక్రవారం కొద్దిసేపు ప్రాక్టీస్ చేశాడు. దీంతో శనివారం నాటి మ్యాచ్‌లో అతడు ఆడేది అనుమానంగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications