నేను కలిస్, వాట్సన్ లాంటివాడిని.. ఓపెనింగ్ చేస్తా, బౌలింగూ వేస్తా: విజయ్ శంకర్

Vijay Shankar కోరిక ఇదీ, Kallis, Watson లాగా ఛాన్స్ రావాలి | SRH ఫ్యాన్స్ ఫైర్ || Oneindia Telugu

చెన్నై: టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ తనని తాను జాక్వెస్ కలిస్, షేన్ వాట్సన్ లాంటి దిగ్గజాలతో పోలుచుకున్నాడు. తాను కలిస్, వాట్సన్ లాంటివాడినని.. వారిలానే ఓపెనింగ్ చేయగలనని, మూడో స్థానంలో ఆడగలనని అలానే బౌలింగ్ కూడా చేస్తానని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ అయినంత మాత్రాన 6-7 స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని ఏమీ లేదని శంకర్ అన్నాడు.

2019 వన్డే ప్రపంచకప్‌కి అంబటి రాయుడిని పక్కన పెట్టిన భారత సెలెక్టర్లు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానం కోసం విజయ్ శంకర్‌ని ఎంపిక చేశారు. అయితే మెగా టోర్నీలో అతడు ఆశించిత మాత్రం రాణించలేదు.

30-40 పరుగులు ఆటగాడిగా మారా

30-40 పరుగులు ఆటగాడిగా మారా

తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ శంకర్‌ పాల్గొని పలు విషయాలపై స్పందించాడు. 5-6 స్థానాల్లో సాధించిన పరుగుల కారణంగా గతంలో భారత జట్టుకు ఎంపికయ్యారు. ఇపుడు జట్టుకు ఆడేటప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావాలని కోరుకుంటున్నారా? అనే ప్రశ్నకు... 'అలాంటిది ఏమీ లేదు. నేను 5 వ స్థానంలో బ్యాటింగ్ చేయగలిగినప్పటికీ.. దానితో సంతోషంగా ఉన్నాను. అది నా బ్యాటింగ్ స్లాట్ అని తెలిస్తే తదనుగుణంగా సిద్ధం అవుతా.

తమిళనాడు, ఐపీఎల్‌లో నేను ఆడిన బ్యాటింగ్ స్థానాలను ఓసారి చూస్తే.. వేర్వేరు స్థానాల్లో ఆడాను. ఎక్కువగా నెంబర్ 6 తర్వాత ఆడాను. చాలా మ్యాచుల్లో బ్యాటింగ్ చేయడానికి నాకు తగినన్ని ఓవర్లు ఉండవు. ఆ తర్వాత 30-40 పరుగులు చేసే ఆటగాడిగా మారా. దేశం కోసం ఆడటానికి నన్ను నేను పుష్ చేసుకోలేను' అని సమాధానం ఇచ్చాడు.

కలిస్, వాట్సన్ లాంటివాడిని

కలిస్, వాట్సన్ లాంటివాడిని

'నేను పరుగులు చేయాలంటే క్రీజులో ఎక్కువ సమయం గడపాలి. అలా అని ఓపెనింగ్ చేస్తానని అనట్లేదు. 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నా. ఒక స్లాట్ ముందుగా పంపిస్తే బాగుంటుంది. అప్పుడు నేను పరుగులు చేయకపోతే.. జట్టు నుంచి తప్పించినా ఓకే. గత రెండేళ్లలో నేను కోల్పోయినది అదే. నేను ఆల్‌రౌండర్‌ని.

కానీ బ్యాట్స్‌మన్‌గా మాత్రమే పేరుగాంచాను. ఆల్‌రౌండర్ అయినంత మాత్రాన 6-7 స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని ఏమీ లేదు. నేను జాక్వెస్ కలిస్, షేన్ వాట్సన్ లాంటివాడిని కూడా కావచ్చు. వారు ఓపెనింగ్ చేస్తారు, మూడో స్థానంలో ఆడతారు. అలానే బౌలింగ్ చేస్తారు. అలానే నేను కూడా టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి పరుగులు, వికెట్లు తీయగలిగితే జట్టుకు మంచిదే కదా' అని విజయ్ శంకర్‌ తెలిపాడు.

అప్పుడు విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఎంఎస్ ధోనీ! అచ్చం జడేజా లానే!! (వీడియో)

నాకేమీ సంబంధం లేదు

నాకేమీ సంబంధం లేదు

విజయ్ శంకర్‌ తొలిసారి త్రీడీ ట్వీట్‌పై స్పందించాడు. 'ఆ త్రీడీతో నాకేమీ సంబంధం లేదు. అభిమానులు ప్రతిసారి ఆ త్రీడీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో నన్ను ఆటపట్టిస్తున్నారు. అంబటి రాయుడు ఆ ట్వీట్ చేసిన తర్వాత ప్రపంచకప్‌లో నేను మూడు మ్యాచ్‌లాడి.. మెరుగైన ప్రదర్శన కనబర్చా. నేనేమీ తప్పులు చేయలేదు. ఐపీఎల్‌లో కూడా నా బ్యాటింగ్ ఆర్డర్ వేరు. అయినప్పటికీ చాలా మంది రాయుడితో నన్ను పోలుస్తున్నారు. ఇద్దరం ఆడుతున్న పరిస్థితులు, బ్యాటింగ్ ఆర్డర్‌లు వేరు. కానీ ఇవేమీ వారు పట్టించుకోవడం లేదు. వాళ్లు నన్ను ట్రోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు' అని విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

నెం.4 స్థానం కోసం విజయ్

నెం.4 స్థానం కోసం విజయ్

2019 వన్డే ప్రపంచకప్‌కి అంబటి రాయుడిని పక్కన పెట్టిన భారత సెలెక్టర్లు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానం కోసం విజయ్ శంకర్‌ని ఎంపిక చేశారు. రాయుడికి బదులుగా శంకర్‌ని ఎంపికచేయడంపై అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. రాయుడితో పోలిస్తే విజయ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ రూపంలో జట్టుకి మూడు కోణాల్లో ఉపయోగపడతాడు. అతను త్రీడీ ప్లేయర్ అని అన్నాడు. దాంతో రాయుడు 'వరల్డ్‌కప్‌ని చూసేందుకు ఇప్పుడే కొత్త త్రీడీ గ్లాస్‌లను ఆర్డర్ చేశాను' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. ఇప్పటికీ విజయ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు త్రీడీ అంశం తెరపైకి వస్తోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 17, 2021, 14:52 [IST]
Other articles published on May 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X