ఇంగ్లాండ్ పరిస్థితులకు విజయ్ బౌలింగ్ పనికొస్తుంది: గంగూలీ

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. ప్రపంచకప్ కోసం టీమిండియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో పంత్, రాయుడులు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే కేఎల్ రాహుల్, విజయ్ శంకర్‌లు చోటు దక్కించుకున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడారు.
'విజయ్ శంకర్ మంచి ఆటగాడు. ప్రపంచకప్‌లో తప్పకుండా బాగా ఆడతాడు. ఇంగ్లాండ్ పరిస్థితులకు విజయ్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుంది. అతడి బౌలింగ్ జట్టుకు పనికొస్తుంది. విజయ్ ఎంపికపై ఎవ్వరికి ఎటువంటి అనుమానాలు అనవసరం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో రాణించాడు కాబట్టే విజయ్‌కి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది' అని గంగూలీ పేర్కొన్నారు.
'ప్రపంచకప్‌లో బ్యాకప్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ కూడా ఎంపిక కావాల్సింది, కానీ ఆలా జరగలేదు. అయినా పంత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ల పంత్‌కు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అతను చాలా ప్రపంచ కప్‌లు ఆడతాడు. దినేష్ కార్తీక్ మంచి ఆటగాడు. ఈ మధ్య కాలంలో బాగా రాణిస్తున్నాడు. అవకాశం వస్తే కార్తీక్ నిరూపించుకుంటాడు' అని గంగూలీ పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications