Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ అభిమాని దూషించినా.. ఏం చేయలేకపోయా: విజయ్

Vijay Shankar reveals a Pakistan fan abused Indian players ahead of 2019 World Cup clash

చెన్నై: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ పోటీ అంటే మ్యాచ్‌కు ముందు నుంచే ఎంతో ఉత్కంఠ ఉంటుంది. మైదానంలోనే కాదు బయట కూడా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ఉంటుంది. ఇక అభిమానుల స్లెడ్జింగ్‌కు అంతే ఉండదు. ఒక్కోసారి ఆటగాళ్లను కూడా దూషించడానికి వెనకాడరు. ఇలాంటి ఘటనే భార‌త ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్‌కు 2019 ప్రపంచకప్‌ సందర్భంగా ఎదురైంది. జూన్‌ 16న మాంచెస్టర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌కు ముందు రోజు జరిగిన ఓ ఘటనను తాజాగా విజయ్‌ షేర్ చేసుకున్నాడు.

చాలా కోపం వచ్చింది

చాలా కోపం వచ్చింది

తాజాగా విజ‌య్ శంక‌ర్‌ భారత్‌ ఆర్మీ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ... 'పాక్‌తో మ్యాచ్‌కు ఒకరోజు ముందు జట్టు మేనేజ్‌మెంట్‌ వచ్చి.. రేపటి మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావు సిద్ధంగా ఉండు అని చెప్పింది. నేను రెడీ అని చెప్పాను. అదే రోజు కొంతమంది ఆటగాళ్లం కాఫీ కోసమని బయటకు వెళ్లాం. అక్కడికి వచ్చిన ఓ పాక్‌ అభిమాని మా వద్దకు వచ్చి ఏవో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతను అలా చేస్తుంటే చాలా కోపం వచ్చింది. అయితే చూస్తూ ఊరుకున్నాం తప్ప అతన్ని ఏం చేయలేకపోయాం. భారత్‌- పాక్‌కు మ్యాచ్‌ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే నాకు తెలిసింది' అని చెప్పాడు. విజయ్ టీమిండియా తరపున 12 వన్డేల్లో 223 పరుగులు.. 9 టీ20ల్లో 101 రన్స్ చేసాడు.

భువనేశ్వ‌ర్ కుమార్‌కు కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో

భువనేశ్వ‌ర్ కుమార్‌కు కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో

2019 ప్రపంచకప్‌కు అంబటి రాయుడుని కాదని విజయ శంకర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాపై ఆడిన మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ గాయం కావడంతో.. జట్టుకు గబ్బర్ దూరమయ్యాడు. దీంతో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు విజయ్. ఆ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసాడు. పేస్ బౌలర్ భువనేశ్వ‌ర్ కుమార్‌కు కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో ఆరంభంలోనే బౌలింగ్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. వేసిన తొలి బంతికి ఇమాముల్‌ హక్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. మరొ ఓవర్‌లో కెప్టెన్ సర్ఫరాజ్‌ అహమ్మద్ వికెట్‌ను కూడా పడగొట్టాడు.

బొటనవేలి గాయంతో దూరం

బొటనవేలి గాయంతో దూరం

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్.. హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ సెంచరీ చేయడంతో నిర్ణీత‌ 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 336 ప‌రుగులు భారీ స్కోర్ చేసింది. అనంత‌రం భారీ ల‌క్ష్య‌ ఛేద‌న‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో తుది జట్టుకు ఎంపికైన విజయ్..‌ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 29 పరుగులు, విండీస్‌తో మ్యాచ్‌లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే అంతలోనే కాలి బొటనవేలి గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

గతేడాది నుంచి దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్న విజయ్:

గతేడాది నుంచి దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్న విజయ్:

2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులో అనూహ్యంగా అవకాశాన్ని దక్కించుకున్న విజయ్ శంకర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గాయంతో మెగాటోర్నీ మధ్యలోనే వెనుదిరిగాడు. గతేడాది చివరి నుంచి దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు తరఫున రెగ్యులర్‌గా మ్యాచ్‌లాడిన విజయ్ శంకర్.. తన ఆటని మెరుగుపర్చుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకుని మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడాలని ఆశించాడు. అయితే.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేయడంతో అతని ఆశలు అడియాశలయ్యాయి.

వికెట్‌ పడ్డ ప్రతీసారి స్నేహితులతో కలిసి గంతులేశా: సచిన్

Story first published: Friday, June 26, 2020, 13:36 [IST]
Other articles published on Jun 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+