'త్రీడీ'తో నాకేం సంబంధం లేదు.. అనవసరంగా రాయుడితో పోలుస్తున్నారు.. విజయ్ శంకర్ అసహనం!

Vijay Shankar Opens Up On His Relationship With Ambati Rayudu 3D Tweet | Oneindia Telugu

చెన్నై: టీమిండియా ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ విజయ్ శంకర్ ఫస్ట్ టైమ్ త్రీడీ ట్వీట్‌పై స్పందించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కు అంబటి రాయుడ్ని పక్కన పెట్టిన భారత సెలెక్టర్లు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానం కోసం విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాయుడికి బదులుగా శంకర్‌ను ఎంపికచేయడంపై అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇస్తూ ''రాయుడితో పోలిస్తే విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ రూపంలో టీమ్‌కి మూడు కోణాల్లో ఉపయోగపడతాడు. అతను త్రీడీ ప్లేయర్'' అని చెప్పుకొచ్చాడు. దాంతో.. అంబటి రాయుడు 'వరల్డ్‌కప్‌ని చూసేందుకు ఇప్పుడే కొత్త త్రీడీ గ్లాస్‌లను ఆర్డర్ చేశాను'అని సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగగా.. ఇప్పటికీ విజయ్ శంకర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ 'త్రీడీ' అంశం తెరపైకి వస్తోంది.

 నేను ఆడిన పరిస్థితులు భిన్నం..

నేను ఆడిన పరిస్థితులు భిన్నం..

2019 వన్డే ప్రపంచకప్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన విజయ్ శంకర్ గాయంతో టోర్నీ మధ్యలోనే ఇంటిదారిపట్టాడు. ఇక శంకర్‌ అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయనపుడల్లా భారత క్రికెట్‌ అభిమానులు తన పేరు ముందు 'త్రీడీ' అనే పదం జోడించి ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై శంకర్‌ స్పందిస్తూ..‘త్రీడీ పేరుతో నాకెలాంటి సంబంధం లేదు. ప్రపంచకప్‌ సమయంలో అభిమానులు నా పేరు ముందు 'త్రీడీ' అని తగిలించి వైరల్‌ చేశారు. ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడా. మెరుగైన ప్రదర్శనే చేశా. నన్ను ప్రతిసారీ రాయుడితో పోలుస్తున్నారు. కానీ నేను ఆడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌లు, పరిస్థితులు చాలా భిన్నం. ఎవరికీ ఇవేం పట్టవు'' అంటూ ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్‌ అసహనం వ్యక్తం చేశాడు.

ఇతరుల కన్నా బాగానే ఆడా..

ఇతరుల కన్నా బాగానే ఆడా..

ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ విజయ్ శంకర్ పేలవ ప్రదర్శన కొనసాగింది. దాంతో అభిమానులు అతన్ని సోషల్ మీడియా వేదికగా ఉతికారేశారు. అయితే శంకర్ మాత్రం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నానంటున్నాడు. చాలా మంది ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శనే చేశానన్నాడు. ‘ఐపీఎల్‌లో నా జట్టు తరఫున బౌలింగ్ బాగానే చేశా. బ్యాటింగ్ విషయానికి వస్తే నేను క్రీజులోకి దిగినప్పుడల్లా.. కొన్ని వికెట్లు పడి, నెట్ రన్‌రేట్ 10-12 మధ్య ఉంటోంది. ఇలాంటి సమయంలో పరుగులు సాధించడం అంత తేలిక కాదు. టీమిండియా తరఫున నేను బాగానే ఆడా. అయితే బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్‌ను కాబట్టి నేను జట్టులో ఉండాలి అనుకోవట్లేదు. నా సామర్థ్యాలను జనాలు నమ్మినప్పుడే నేను జట్టులోకి రావాలనుకుంటున్నా.

రన్‌రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు..

రన్‌రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు..

ఒకవేళ ఇతరులతో పోల్చాలి అంటే మాత్రం చాలా మంది ఆటగాళ్ల కంటే నేను మెరుగైన ప్రదర్శన చేశా. టీమిండియాలోకి తిరిగి రావడం గురించి ఆలోచించట్లేదు. అతి నా చేతుల్లో లేదు. దేశం కోసం ఆడినవాళ్లు ఎవరైనా మళ్లీ ఆ జెర్సీ ధరించాలని ఆశపడతారు. నాకు వచ్చిన అవకాశాలను అందుకుని రాణించినప్పటికీ నన్ను జట్టులో కొనసాగించలేదని నిరాశగా ఉంది. చివరగా న్యూజిలాండ్‌తో టీ20ల్లోనూ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసి మంచి స్కోర్లు సాధించా. నేనాడిన 12 వన్డేల్లో 8 లేదా 9 సార్లు మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అందులో అయిదు సార్లు సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉన్న సమయంలోనే క్రీజులోకి వెళ్లా'అని శంకర్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 17, 2021, 9:06 [IST]
Other articles published on May 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X