విజయ్ శంకర్: రెండో వన్డేలో ఆఖరి ఓవర్ యాక్షన్ హీరో


హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియాకు ఈ విజయం అంత తేలిగ్గా చిక్కలేదు. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు కావాలి. భారత్ నెగ్గాలంటే... 2 వికెట్లు పడాలి. అటువైపు చూస్తే క్రీజులో మార్కస్ స్టోయినిస్ (65 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రధాన బౌలర్లు బుమ్రా (2/29), షమీ (0/60) కోటా పూర్తి కావడంతో 50వ ఓవర్‌ను మీడియం పేసర్ విజయ్ శంకర్‌తో వేయించాల్సి వచ్చింది.

ఒత్తిడిని తట్టుకుంటూ
ఈ పరిస్థితుల్లో అభిమానులంతా టీమిండియా ఓటమి ఖాయమే అనుకున్నారు. ఎందుకంటే అప్పటికి అతడు వేసింది ఒకే ఓవర్. భారత అభిమానుల్లో ఉద్విగ్నత. కానీ ఒత్తిడిని తట్టుకుంటూ శంకర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అనుభవం లేకపోయినా.. ప్రతిభకు కొదువలేదని విజయ్ శంకర్ నిరూపించాడు.

స్టొయినిస్‌ను ఎల్బీగా
తొలి బంతికే అతను స్టొయినిస్‌ను ఎల్బీగా ఔట్ చేసి దాదాపుగా మ్యాచ్‌ను ముగించాడు. రివ్యూలో కూడా ఫలితం భారత్‌కే అనుకూలంగా వచ్చింది. 6 వన్డేల కెరీర్‌లో అతనికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం. ఇక, రెండో బంతికి జంపా (2) రెండు పరుగులు తీయడంతో మళ్లీ ఏదో ఓ మూలన సందేహం. మూడో బంతి యార్కర్.. దెబ్బకు జంపా మిడిల్ వికెట్ లేచిపోయింది.
సంబరాల్లో భారత్ అభిమానులు
ఇంకేముంది అప్పటి వరకు ఊపిరిబిగపట్టి చూసిన స్టేడియం మొత్తం సంబరాల్లో ముంచెత్తాడు. రెండో వన్డేలో కంగారూలను కట్టడి చేయంలో బుమ్రాది ఎంతో విలువైన పాత్ర. అద్భుతమైన బౌలింగ్‌తో అతడు భారత్‌ను విజయం ముంగిట నిలిపాడు. జోరు మీదున్న స్టాయినిస్ వికెట్ సహా చేతిలో నాలుగు వికెట్లున్న ఆస్ట్రేలియా ఆఖరి ఐదు ఓవర్లలో విజయం కోసం చేయాల్సింది 30 పరుగులే.

ఆసీస్‌ను కట్టిపడేసిన బుమ్రా
కానీ పదునైన బౌలింగ్‌తో ఆసీస్‌ను కట్టిపడేసిన బుమ్రా.. 46వ ఓవర్లో 1 పరుగు మాత్రమే ఇచ్చి కౌల్టర్‌నైల్, కమిన్స్‌లను ఔట్ చేశాడు. చివరి మూడు ఓవర్లలో ఆసీస్ 18 పరుగులు చేయాల్సివుండగా.. 48వ ఓవర్లోనూ ఒక్క పరుగే ఇచ్చాడు. నిజానికి 46వ ఓవర్‌నే శంకర్‌తో వేయించాలని తాను అనుకున్నానని, అయితే బుమ్రా, షమీ వరుసగా నాలుగు ఓవర్లు వేసి 49వ ఓవర్లోనే ఆట ముగిస్తారని ధోని, రోహిత్ చెప్పిన సలహాను పాటించానని కోహ్లీ మ్యాచ్ తర్వాత చెప్పాడు.

వన్డేల్లో టీమిండియాకు ఇది 500వ విజయం
వన్డేల్లో టీమిండియాకు ఇది 500వ విజయం. 1975లో వెంకట్రాఘవన్ సారథ్యంలోని టీమ్‌ఇండియా.. ఈస్ట్ ఆఫ్రికాపై తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే, టీమిండియా సాధించిన 300వ, 400వ, 500వ వన్డే విజయాల్లో ధోని భాగస్వామి కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications