Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH:విజయ్ 'శంకరా'.. ఈరోజు కూడా జట్టులో ఉంటావా?! సన్‌రైజర్స్‌కు మరో ఓటమి తప్పదు పో!

Vijay Shankar in Playing 11 trolls by SRH Fans vs CSK
IPL 2021, CSK vs SRH : Vijay Shankar అవసరమా... గా శంకర్ గురించి ఓ తూరి ఆలోచించరాదే | Oneindia Telugu

హైదరాబాద్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకి చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడి ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నెం.2 స్థానంలో చెన్నై కొనసాగుతుండగా.. హైదరబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌లకిగానూ ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. పటిష్ట చెన్నైని ఓడించాలంటే.. సన్‌రైజర్స్ కష్టపడాల్సిందే. అయితే ఐపీఎల్ 2021 ఆరంభం నుంచి హైదరాబాద్‌ను వేధిస్తోన్న ప్రధాన సమస్య మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌.

టాప్ ఆర్డర్ బాగున్నా.. మిడిలార్డర్‌లో ఒక్క సరైన బ్యాట్స్‌మన్‌ లేక సన్‌రైజర్స్ హైదరబాద్ ఇబ్బందులు పడుతోంది. స్టార్ ఆటగాడు మనీష్ పాండే పరుగులు చేస్తున్నా.. వేగంగా ఆడలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌‌పై 14 బంతుల్లో 4 రన్స్ చేసిన విరాట్ సింగ్ బదులు ఈ రోజు మనీష్ జట్టులోకి రానున్నాడు. ఢిల్లీ మ్యాచ్ అనంతరం కెప్టెన్ మాటలను బట్టి చూస్తే.. మనీష్ ఈరోజు కచ్చితంగా మ్యాచ్ ఆడనున్నాడు. ఇక విరాట్ సింగ్, కేదార్ జాదవ్, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్ ఒత్తిడికి తలొగ్గి పేలవంగా వికెట్లు చేజార్చుకుంటున్నారు. ఇప్పటివరకు వీరందరూ మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. దీంతోనే గెలవాల్సిన ఐదు మ్యాచుల్లో వార్నర్ సేన ఓటమిపాలైంది.

అందరికంటే ముఖ్యంగా టీమిండియా ఆటగాడైన విజయ్ శంకర్‌.. జట్టుకు భారంగా మారాడు. ఇప్పటికి హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో శంకర్‌కు అవకాశం దక్కింది. ఈ ఐదు మ్యాచ్‌‌ల్లో బౌలింగ్‌లో కొద్దిగా పర్వాలేదనిపించినా.. ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లోనైతే మరీ ఘోరంగా విఫలమై జట్టు ఓటమికి కారణమయ్యాడు. శంకర్ వరుసగా 11, 3, 28, 8 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ మ్యాచ్ ముగించడంతో శంకర్‌కు బ్యాటింగ్ రాలేదు. లేకుంటే ఆ మ్యాచ్ కూడా సన్‌రైజర్స్ ఓడిపోయేది.

బుధవారం చెన్నైతో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో విజయ్ శంకర్ విషయంలో సన్‌రైజర్స్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా శంకర్ తుది జట్టులో ఉంటాడా? అని ఫాన్స్ భయపడిపోతున్నారు. జట్టుకు భారంగా మారిన శంకర్‌పై అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫన్నీ మీమ్స్, కామెంట్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'విజయ్ శంకరా.. ఈరోజు కూడా జట్టులో ఉంటావా?' అని ఒకరు కామెంట్ చేయగా.. 'శంకర్ జట్టులో ఉంటే సన్‌రైజర్స్‌కు మరో ఓటమి తప్పదు పో' అని మరొకరు కామెంట్ చేశారు. 'దేవుడా.. ఈ రోజు శంకర్ మ్యాచ్ ఆడొద్దు', 'భారత జట్టుకు నువ్వెలా ఎంపికయ్యావు సామీ', 'డేవిడ్ భాయ్.. ఆ శంకర్ మనకు అవసరమా?', 'దేవ్ అన్నా.. గా శంకర్ గురించి ఓ తూరి ఆలోచించరాదే' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Wednesday, April 28, 2021, 15:01 [IST]
Other articles published on Apr 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+