3D ప్లేయర్ శంకరన్న ఫేవరెట్ ఆ ఆఫ్ఘన్ ఆటగాడే.!
భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న సమయంలో భారత మాజీ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఆఫ్ఘన్ స్టార్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో జరిగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైనప్పటికీ.. ఒమర్జాయ్ 44 బంతుల్లో 64 నాటౌట్‌తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లోనూ సంజు శాంసన్ వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. "ఒమర్జాయ్ నా ఫేవరెట్ ప్లేయర్. ఒమర్జాయ్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. అద్భుతంగా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తాడు. అతడు కేవలం రెండు ఓవర్లు వేసే పార్ట్-టైమ్ ఆల్‌రౌండర్ కాదు, కంప్లీట్ ప్యాకేజ్ ఉన్న ప్రాపర్ ఆల్‌రౌండర్" అని విజయ్ శంకర్ ప్రశంసించారు.
ఒమర్జాయ్ ఆల్‌రౌండ్ నైపుణ్యం
26 ఏళ్ల ఒమర్జాయ్ ఆఫ్ఘనిస్తాన్ జట్టులో అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ముఖ్యంగా వన్డేల్లో అతనికి 40 పైగా సగటు, 98.50 స్ట్రైక్ రేట్‌తో పాటు బౌలింగ్లో 28.28 సగటు ఉంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ స్థిరమైన ప్రదర్శన క్రికెట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షిస్తోంది.

నితీష్ కుమార్ రెడ్డికి వరుస అవకాశాలు ఇవ్వాలి: విజయ్ శంకర్
మరోవైపు భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో అవకాశాలు ఇవ్వాలని విజయ్ శంకర్ జట్టు యాజమాన్యాన్ని కోరారు. తొలి టీ20లో నితీష్ కుమార్ రెడ్డికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్ లో 2 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఓ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా తక్కువ అవకాశాలు వచ్చినప్పుడు నిరూపించుకోవడం అంత సులభం కాదని విజయ్ శంకర్ అభిప్రాయపడ్డారు.
భారత్‌కు మంచి ఆల్‌రౌండర్‌గా మారే సామర్థ్యం
"నితీష్ పరుగులు ఇచ్చినప్పటికీ అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాలి. ఓ ఆల్‌రౌండర్‌గా రాణించడం తేలిక కాడు. ఒకటి లేదా రెండు ఓవర్లు మాత్రమే వచ్చే అవకాశంలోనే ప్రభావం చూపాల్సి ఉంటుంది. బ్యాటర్‌గా అందరూ బాగా ఆడుతుండటంతో నితీష్ కుమార్ రెడ్డి తన అవకాశం కోసం వేచి చూడక తప్పదు. నిరంతరం మ్యాచ్‌లు ఆడిస్తే నితీష్ ఇండియాకు చాలా మంచి ఆల్‌రౌండర్‌గా మారతాడు" అని విజయ్ శంకర్ పేర్కొన్నారు. హార్దిక్ పాండ్యా గాయపడిన నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డికి రెండో టీ20లో మరో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


