బ్యాడ్ న్యూస్! టీమిండియాలో గాయపడ్డ మరో ఆల్ రౌండర్: ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌కు దూరం!

సౌథాంప్టన్: క్రికెట్ ప్రేమికులకు మరో దుర్వార్త! టీమిండియాలో మరో క్రికెటర్ గాయపడ్డాడు. మడమల్లో నొప్పి కారణంగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ శనివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం అయ్యాడు. సౌథాంప్టన్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌ను ఎదుర్కొనబోతోంది టీమిండియా. దీనికోసం రోజ్‌బౌల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న సందర్భంగా- టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సంధించిన ఓ యార్కర్ నేరుగా విజయ్ శంకర్ పాదాలను బలంగా తాకింది. దీనితో అతని మడమలో సమస్యలు తలెత్తాయి. బంతి తీవ్రతకు మడమల్లో వాపు కనిపించిందని జట్టు ఫిజియోథెరఫిస్ట్ తెలిపారు.

మడమల్లో వాపు..
ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు లేవని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. బంతి తన పాదాలను తగిలిన వెంటనే- బాధతో విలవిల్లాడుతూ విజయ్‌శంకర్ అక్కడే కూర్చుండిపోయాడు. కొద్దిసేపటి తరువాత కుంటుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడరని చెబుతున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీ) ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి ఇంకా 36 గంటల పాటు సమయం ఉన్నందున.. ఈ లోగా కోలుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

శిఖర్, భువనేశ్వర్..ఇక విజయ్ శంకర్ కూడానా!
డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ టోర్నమెంట్ మొత్తానికీ దూరమైన నేపథ్యంలో.. విజయ్ శంకర్ పాత్ర కీలకంగా మారింది. బ్యాటుతో, బంతితో రాణించే విజయ్ శంకర్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఆడుతూ వచ్చిన కేఎల్ రాహుల్‌ను రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా పంపించడం దాదాపు ఖాయమైనట్టే. రాహుల్ లేదా రిషబ్ పంత్‌లల్లో ఎవరో ఒకరు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభిస్తారు. ఈ క్రమంలో- విజయ్ శంకర్ బౌలింగ్‌లో కూడా నైపుణ్యాన్ని చూపిస్తున్న నేపథ్యంలో అతణ్ని నాలుగో స్థానానికి తీసుకోవాలనేది జట్టు మేనేజ్‌మెంట్ వ్యూహం. ఈ పరిస్థితుల్లో విజయ్ శంకర్ గాయపడటం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఫుల్ టైమ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం వల్ల జట్టుకు దూరం అయ్యాడు. ఆఫ్ఘన్ సహా మూడు మ్యాచ్‌లకు భువనేశ్వర్ కుమార్ దూరం అయ్యాడు.

తొలి బంతికే వికెట్..
ప్రపంచకప్‌లో తన తొలిబంతికే వికెట్‌ను బలి తీసుకున్న బౌలర్‌గా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు విజయ్ శంకర్. ఈ నెల 16వ తేదీన మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఫీట్‌ను సాధించాడు. కాలి కండరాలు పట్టేయడంతో బౌలింగ్ నుంచి అర్ధాంతరంగా భువనేశ్వర్ కుమార్ వైదొలగి వెళ్లిపోగా.. ఆ కోటాను భర్తీ చేయడానికి వచ్చిన విజయ్ శంకర్.. తొలి బంతికే వికెట్‌ను పడగొట్టాడు. విజయ్ శంకర్ సంధించిన బంతి తక్కువ ఎత్తులో వెళ్లింది. బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయిన పాకిస్తాన్ ఓపెనర్ ఇనాముల్ హక్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఎల్‌బీగా అవుట్ అయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications