వైరల్ ఫొటోలు.. టీమిండియా ఆల్‌రౌండర్‌కి నిశ్చితార్థం!!

చెన్నై: ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఒక్కొక్కరు పెళ్లిపీటలెక్కుతున్నారు. జూన్ చివరి వారంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నిశ్చితార్థం చేసుకోగా.. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. గురువారం తనకు నిశ్చితార్థం అయినట్టు విజయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన కాబోయే బార్య వైశాలి వీశ్వేశ్వరన్‌తో కలిసి దిగిన రెండు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకి ఉంగరం ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
అభినందలు సోదరా:
నిశ్చితార్థం సందర్బంగా విజయ్ శంకర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చహల్ 'అభినందలు సోదరా' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. 2019 ప్రపంచకప్ కోసం భారత జట్టులో భాగమైన విజయ్ శంకర్‌ను కరుణ్ నాయర్, అభినవ్ ముకుంద్, జయంద్ యాదవ్ కూడా అభినందించారు. శంకర్ భారత్ తరఫున ఇప్పటి వరకు 12 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. 2018లో కొలంబోలో జరిగిన శ్రీలంక-భారత్ టీ20 మ్యాచ్‌తో భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఏడాదికి మెల్‌బోర్నోలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి వన్డేలో అరంగేట్రం చేశాడు. త్వరలో యూఏఈలో జరిగే ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

రాయుడుని కాదని:
2019 ప్రపంచకప్‌కు తెలుగు తేజం అంబటి రాయుడుని కాదని బీసీసీఐ సెలెక్టర్లు విజయ శంకర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాపై ఆడిన మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కావడంతో.. జట్టుకు గబ్బర్ దూరమయ్యాడు. దీంతో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసాడు. పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు కండరాలు పట్టేయడంతో ఆరంభంలోనే బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. వేసిన తొలి బంతికి ఇమాముల్ హక్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. మరొ ఓవర్‌లో కెప్టెన్ సర్ఫరాజ్ అహమ్మద్ వికెట్‌ను కూడా పడగొట్టాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 29 పరుగులు, విండీస్‌తో మ్యాచ్‌లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు.

ఐపీఎల్ 2020 రాణించి:
2019 వన్డే ప్రపంచకప్ జట్టులో అనూహ్యంగా అవకాశాన్ని దక్కించుకున్న విజయ్ శంకర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గాయంతో మెగా టోర్నీ మధ్యలోనే వెనుదిరిగాడు. గతేడాది చివరి నుంచి దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు తరఫున రెగ్యులర్‌గా మ్యాచ్‌లాడిన శంకర్.. తన ఆటని మెరుగుపర్చుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకుని మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications