విజయ్ విక్టరీ వెనుక ధోనీ మేనియా...వీడియో వైరల్..!!
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి.సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఊహించని విధంగా విజయడంకా మోగించింది. ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలతో విజయ్ ఏళ్ల తరబడి పాతుకుపోయిన పార్టీలను మట్టికరిపించారు. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లను కైవసం చేసుకోగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మరో 10 సీట్ల కోసం కార్యాచరణ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆయన విజయం వెనుక ఎంఎస్ ధోనీ తరహా కెప్టెన్ కూల్ వ్యూహం ఉందని అభిమానులు భావిస్తున్నారు. తలపతి విజయ్ రాజకీయ అరంగేట్రం ఒక భారీ సినిమా బ్లాక్‌బస్టర్‌ను తలపించగా సినిమా గ్లామర్‌కు క్రీడా స్ఫూర్తి తోడవడంతో ఈ గెలుపు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

గత ఏడాది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ TVK పార్టీకి మద్దతు ఇవ్వడం ఆ పార్టీ విజయానికి గట్టి పునాది వేసింది.. ధోనీ CSKను గెలిపించినట్లే, తాను విజయ్ నాయకత్వంలో TVKను గెలిపిస్తానని ఆయన అప్పుడే ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ధోనీకి ఉన్న క్రేజ్‌ను ప్రస్తావించడం ద్వారా ప్రశాంత్ కిషోర్ అటు క్రీడా అభిమానులను ఇటు యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించారు.
An old video of Prashant Kishor, who is said to have crafted the political blueprint for Vijay, has resurfaced amid the Tamil Nadu election buzz.
— Salt (@saltbylutyens) May 4, 2026
In the clip, he predicts TVK could win independently and says he would become more famous than MS Dhoni in Tamil Nadu, gaining… pic.twitter.com/sIph18PM4L
TVK పార్టీకి కేటాయించిన విజిల్ గుర్తు ఓటర్లను బాగా ఆకర్షించింది. తమిళ ప్రజలకు విజిల్ అనగానే వెంటనే CSK విజిల్ పోడు పాట గుర్తుకు వస్తుంది, దీనివల్ల ప్రచార సభలన్నీచేపాక్ స్టేడియంలా సందడిగా మారాయి.మైదానంలో తల(ధోనీ)ని ఆరాధించే యువత, పోలింగ్ బూత్‌లో తలపతి(విజయ్)కి మద్దతు ఇవ్వడం ఒక సహజమైన పరిణామంగా మారింది. ఎన్నికల చివరి దశలో TVK వంద సీట్ల మైలురాయిని దాటడం ధోనీ మార్క్ ఫినిషింగ్ స్టైల్‌ను గుర్తుకు తెచ్చింది.
Vijay Thalapathy was not wrong when he said this:
— Abhishek Kumar (@Abhishek060722) May 4, 2026
“Even in cricket, the one who whistles is Tamil Nadu—CSK! Even in the upcoming election, the one who is going to blow the whistle is our TVK!”🔥 pic.twitter.com/rKM49Lp6xA
ప్రస్తుతం 108 సీట్లతో విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు కొంచెం దూరంలో ఆగిపోయారు. వ్యూహాత్మక అడుగుల ద్వారా విజయ్ తన రాజకీయ పరిపక్వతను ఎలా చాటుకుంటారో చూడాలి. తలపతి సామర్థ్యానికి ఇది అసలైన పరీక్షగా నిలవనుంది.
Whistle podu 🔥🔥🔥🔥
— Méfiant (@TheSolo__9) May 4, 2026
Cup mulhyam bigiluuuuu 😅🔥🔥#CMVijay#TVKVijay pic.twitter.com/ttRGbkmYRb
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications