Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింహాల్లెక్క గర్జించుర్రి.. ఆర్సీబీకి మాల్యా సలామ్!

ఐపీఎల్ 2026 హంగామా నేటి నుంచే ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ కీలక తరుణంలో ఆర్సీబీ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా ఎక్స్(ట్విట్టర్) వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కన్నడలో విజయ్ మాల్యా సందేశం
విజయ్ మాల్యా తన మాజీ జట్టుపై ఉన్న ప్రేమను చాటుకుంటూ ఇంగ్లీష్‌తో పాటు కన్నడ భాషలో ట్వీట్ చేశారు. "బెంగళూరు సింహాల్లారా.. ఐపీఎల్ ఛాంపియన్లకు సమయం ఆసన్నమైంది. గుడ్ లక్.. ప్లే బోల్డ్.. ధైర్యంగా ఆడండి" అంటూ విజయ్ మాల్యా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఆర్సీబీ అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. " నమ్మ ఆర్సీబీ.. ఇది మన సమయం" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Vijay Mallya Viral Post for RCB From Rs 450 Cr to Rs 16 500 Cr Valuation as IPL 2026 Begins

రూ.450 కోట్ల పెట్టుబడి.. నేడు రూ.16,500 కోట్లు!
రెండు రోజుల క్రితమే విజయ్ మాల్యా ఆర్సీబీ విలువపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను 2008లో ఆర్సీబీ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చాలా మంది అది పిచ్చితనమని విమర్శించారని విజయ్ మాల్యా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ అక్షరాలా రూ.16,500 కోట్లకు చేరుకోవడం పట్ల ఆయన గర్వం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన జీవితంలో ఓ గొప్ప జ్ఞాపకమని.. ఆర్సీబీ ఎప్పటికీ తన డీఎన్ఏలోనే ఉంటుందని విజయ్ మాల్యా పేర్కొన్నారు.

ఆర్సీబీకి కొత్త యజమానులు ఎవరు?
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి ఆర్సీబీ యాజమాన్యం ఇప్పుడు ఓ భారీ కన్సార్టియం చేతుల్లోకి వెళ్లింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఒప్పందంగా నిలిచింది. ఈ కన్సార్టియంలో ఆదిత్య బిర్లా గ్రూప్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్ స్టోన్ సంస్థలు ఉన్నాయి. ఆర్యమాన్ విక్రమ్ బిర్లా ఫ్రాంచైజీ కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. టైమ్స్ గ్రూప్‌కు చెందిన సత్యాన్ గజ్వాని వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్సీబీ ప్రస్థానం
గతేడాది (IPL 2025)లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఆ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ (43 పరుగులు), కృనాల్ పాండ్యా (2/17) అద్భుత ప్రదర్శన చేశారు. ఇప్పుడు రజత్ పాటిదార్ సారథ్యంలో జట్టు మళ్లీ కప్పును ముద్దాడాలని అభిమానులు ఆశిస్తున్నారు. నేడు రాత్రి 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న పోరులో ఆర్సీబీ బోణి ఎలా ఉంటుందో చూడాలి!

Story first published: Saturday, March 28, 2026, 10:57 [IST]
Other articles published on Mar 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+