For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్సీబీని కొనుగోలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఇదే: విజయ్ మాల్యా

Vijay Mallya: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. 18 సీజన్ల టైటిల్ కరువును ఆ జట్టు ముగించింది. ఆర్సీబీ జట్టు తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. కానీ బెంగళూరు చేరుకున్న తర్వాత వారి వేడుక కాస్త సంతాపంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన వేడుకల సందర్భంగా అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో పాటు 50 మందికికి పైగా గాయపడ్డారు. ఆర్సీబీ జట్టు 2008 నుంచి లీగ్‌లో భాగంగా ఉంది. కానీ 18వ సీజన్‌లో మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టు విజయం తర్వాత అభిమానులు పరారీలో ఉన్న విజయ్ మాల్యాను కూడా గుర్తు చేసుకున్నారు. విజయ్ మాల్యా ఆర్సీబీ ఫ్రాంచైజీకి మొదటి యజమాని కూడా.

అయితే విజయ్ మాల్యా రాజ్ షమానీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా కీలక వివరాలను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో సహా మూడు ఫ్రాంచైజీలకు బిడ్ వేసినట్లు తెలిపాడు. అయితే ముకేశ్ అంబానీ అత్యధిక ధరను కోట్ చేయడంతో కొనలేకపోయినట్లు చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని అతి తక్కువ తేడాతో కోల్పోయిన తర్వాత విజయ్ మాల్యా చివరకు 112 మిలియన్ల యూఎస్ డాలర్లకు ఆ సమయంలో ఆర్సీబీని కొనుగోలు చేశాడు. ఆ సమయంలో 2008లో 112 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ రూ.600-700 కోట్లు అని.. ఆర్సీబీని కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం తన విస్కీ బ్రాండ్ "రాయల్ ఛాలెంజ్" ని ప్రోత్సహించడమేనని విజయ్ మాల్యా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో దాని వెనుక ఆయనకు క్రికెట్ పట్ల ప్రేమ లేదని తెలుస్తోంది.

Vijay Mallya Reveals Why He Bought RCB The Real Reason Behind the Deal

"లలిత్ మోడీ మాటలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను"
విజయ్ మాల్యా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఈ లీగ్‌కు సంబంధించి లలిత్ మోడీ బీసీసీఐ కమిటీకి చెప్పిన మాటల నేపథ్యంలో నేను చాలా సంతోషం వ్యక్తం చేశాను. అతను ఓ రోజు ఫోన్ చేసి జట్లు వేలం వేయబోతున్నామని చెప్పాడు. ఈ జట్లలో దేనినైనా కొనడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. నేను మూడు ఫ్రాంచైజీలపై ఆసక్తి చూపించాను. బిడ్ వేశాడు. నేను ముంబై ఫ్రాంచైజీని చాలా తక్కువ తేడాతో కొనుగోలు చేయలేకపోయాను." అని మాల్యా పేర్కొన్నారు.

ఐపీఎల్‌ను గేమ్ ఛేంజర్‌గా చూశాను..
"2008లో ఆర్సీబీ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేసినప్పుడు ఐపీఎల్‌ను భారత క్రికెట్‌కు గేమ్ ఛేంజర్‌గా చూశాను. బెంగళూరు స్ఫూర్తికి డైనమిక్ జట్టుకు సృష్టించడం నా ఆలోచన. నేను 112 మిలియన్ల డాలర్లు చెల్లించాను. అది రెండో అత్యధిక బిడ్, ఎందుకంటే ఆర్సీబీ జట్టు సామర్థ్యాన్ని నేను నమ్మాను. ఆర్సీబీని మైదానంలో మాత్రమే కాకుండా బయట కూడా అద్భుతంగా కనిపించే బ్రాండ్‌గా మార్చాలని నేను కోరుకున్నాను. అందుకే దానిని అత్యధికంగా అమ్ముడుపోయే మా లిక్కర్ బ్లాండ్లలో ఒకటైన రాయల్ ఛాలెంజ్‌తో అనుసంధానించి దానికి ఆ బోల్డ్ ఐడెంటిటీని ఇచ్చాను" అని విజయ్ మాల్యా చెప్పుకొచ్చారు.

కోహ్లీని ఎందుకు కొనుగోలు చేశాడో చెప్పిన మాల్యా
వేలంలో విరాట్ కోహ్లీని కొనుగోలు చేయడం గురించి కూడా విజయ్ మాల్యా వివరించాడు. విరాట్ కోహ్లీని తన రాష్ట్ర జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్(అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్) కొనుగోలు చేస్తుందని భావించినప్పటికీ.. ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రదీప్ సంగ్వాన్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ విరాట్ కోహ్లీతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం లభించింది. తాను ఆర్సీబీని పవర్‌హౌస్‌గా మార్చగల ఆటగాళ్లను ఎంచుకున్న విజయ్ మాల్యా చెప్పాడు. అండర్-19 ప్రపంచకప్ జట్టు నుంచి యువ ఆటగాడు విరాట్ కోహ్లీని కొనుగోలు చేయడం తనకు గర్వకారణమైన క్షణం అంటూ విజయ్ మాల్యా పేర్కొన్నాడు. ఈ ఆటగాడు ప్రత్యకమైనవాడని తనకు అంతర్గతంగా ఒక భావన ఉందన్నాడు. అందుకే అతని కోసం బిడ్ వేసినట్లు చెప్పాడు. ఎంపిక ప్రక్రియకు కొద్దిసేపటి ముందు కోహ్లీ అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతని ఆటతో చాలా ఆకట్టుకున్నానన్నాడు. అందుకే అతడిని ఎంచుకున్నానన్నాడు. 18 ఏళ్ల తర్వాత కోహ్లీ అదే జట్టులో ఉండడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు.

ద్రవిడ్-కుంబ్లేను ఎందుకు కొన్నాడో చెప్పాడు?
విజయ్ మాల్యా మాట్లాడుతూ.. "రాహుల్ ద్రవిడ్‌ను మా ఐకాన్ ప్లేయర్‌గా ఎంచుకున్నారు. అతను బెంగళూరుకు గర్వకారణం కాబట్టి ఇందులో రెండో ఆలోచన లేదు. మేము జాక్వెస్ కల్లిస్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ వంటి ప్రపంచ స్టార్లను కూడా తీసుకువచ్చాం. స్థానిక హీరోలతో పాటు అంతర్జాతీయ స్టార్లను కూడా జట్టులో చేర్చాం. ఐపీఎల్ ట్రోఫీని బెంగళూరుకు తీసుకురావాలనేది నా కల. ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని నేను జట్టును నిర్మించాను." అని అన్నారు.

Story first published: Friday, June 6, 2025, 14:57 [IST]
Other articles published on Jun 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+