Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహాద్భుతం: కోహ్లీ, ఏబిపై మాల్యా ప్రశంసలు

బెంగళూరు: వివిధ బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా రుణాలను ఎగవేసి దేశం నుంచి పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కింగ్‌ ఫిషర్స్‌ మాజీ ఛైర్మన్‌ విజయ్‌మాల్యా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు.

Vijay Mally praises Kohli and Ab de villiers

శనివారం గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ శతకాలతో కదంతొక్కి ఆ జట్టుకు భారీ విజయాన్నందించిన విషయం తెలిసిందే. టీ20 చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు శతకాలు చేయటం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించారు.

ఈ నేపథ్యంలో మాల్యా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. 'టీ20ల్లో అద్భుతం సృష్టించారు. ప్రపంచ ఛాంపియన్‌ ఆటగాళ్లు 229 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. చాలా గర్వంగా ఉంది' అని పేర్కొన్నారు.

'248 పరుగుల స్కోరు చేయటం అద్భుతం. అసలైన టీ20 మ్యాచ్‌ అంటే ఇదే! నేను వీరిద్దరిని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఎంపిక చేసుకున్నందుకు చాలా ఆనందపడుతున్నా' అని ట్వీట్‌ చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+