ఆవిరైన హైదరాబాద్ ఆశలు.. ఫైనల్‌లోకి ముంబై


న్యూఢిల్లీ: అఖిల భారత విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు చుక్కెదురైంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ముంబై 60 పరుగుల తేడా (వీజేడీ పద్ధతిలో సవరించిన లక్ష్యం 96 పరుగులు)తో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 246 పరుగులు సాధించింది. రోహిత్ రాయుడు (121 నాటౌట్; 132 బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సులు) అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచి జట్టును ఆదుకున్నాడు.

పృథ్వీ 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
అనంతరం ముంబై 25 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసింది. వెస్టిండీస్‌పై ఇటీవల టెస్టుల్లో అదరగొట్టిన యువ ఓపెనర్ పృథ్వీ షా.. దేశవాళీ క్రికెట్‌లోనూ అదే జోరుని కొనసాగించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ జట్టుతో బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీ షా (61: 44 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సులతో) చెలరేగి ఆడాడు. 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.

రోహిత్‌తో కలిసి షా ఎడాపెడా బౌండరీలు
వెస్టిండీస్‌పై రాజ్‌కోట్ టెస్టులో 134 పరుగులు, ఉప్పల్ టెస్టులో 70, 33 పరుగులు చేసిన పృథ్వీ షా.. ఈ మ్యాచ్‌లో స్వేచ్ఛగా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. లక్ష్య ఛేదనని ఓపెనర్ రోహిత్ శర్మ (17: 24 బంతుల్లో 2ఫోర్ల)తో కలిసి ఆరంభించిన పృథ్వీ షా ఎడాపెడా బౌండరీలు బాదేసి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. వర్షం వచ్చే సూచనలు కనిపించడంతో.. తొలి ఓవర్ నుంచి మెరుగైన రన్‌రేట్‌ని కొనసాగించాడు.

ముంబై జట్టు 25 ఓవర్లు ముగిసే సమయానికి
ఈ క్రమంలో తొలి వికెట్‌కి కేవలం 9.5 ఓవర్లలోనే 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. ఇందులో రోహిత్ చేసిన పరుగులు 17 మాత్రమే. జట్టు స్కోరు 73 వద్ద రోహిత్ శర్మ ఔటవగా.. 82 వద్ద పృథ్వీ షా కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (55 నాటౌట్; 53 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సులతో దూకుడు కొనసాగించడంతో ముంబై జట్టు 25 ఓవర్లు ముగిసే సమయానికి 155/2తో మెరుగైన స్థితిలో నిలిచింది.

(వీజేడీ పద్ధతి) ప్రకారం.. విజేతని ప్రకటించగా:
ఈ దశలో భారీ వర్షం రావడంతో.. మ్యాచ్ కొనసాగే అవకాశం లేనందున వి. జయదేవన్ సిస్టమ్ (వీజేడీ పద్ధతి) ప్రకారం.. విజేతని ప్రకటించారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి విజేడీ పద్ధతిలో ముంబై జట్టు 25 ఓవర్లలో 95 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికే జట్టు స్కోరు 155/2తో ఉంది. శనివారం ముంబై జట్టు టోర్నీ ఫైనల్లో ఢిల్లీ లేదా జార్ఖండ్ జట్లలో ఒకదానితో తలపడనుంది. గురువారం మరో సెమీస్‌లో ఢిల్లీ, ఝార్ఖండ్ ఢీకొననున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications