Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ రెచ్చిపోయినా.. గంభీర్ చేతిలో చిత్తు

బెంగళూరు: చాలా ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్న భారత క్రికెట్ టి 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విజయ్ హజారే ట్రోఫీలో బ్యాటుతో రాణించాడు. ధోనీ రాణించినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు జార్ఖండ్ మాత్రం క్వార్టర్స్‌లో 99 పరుగుల తేడాతో గౌతమ్ గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ చేతిలో ఓడింది.

పేసర్ వరుణ్ ఆరోన్ నాయకత్వంలోని జార్ఖండ్ జట్టులో ధోనీ ప్రధాన ఆటగాడు. జార్ఖండ్, ఢిల్లీ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Vijay Hazare Trophy: MS Dhoni's top score not enough as Jharkhand bow out

226 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జార్ఖండ్ జట్టు కేవలం 38 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ధోనీ (70) రాణించినా అతనికి సహకారం అందించే ఆటగాడు కరవయ్యాడు. దీంతో ఢిల్లీ చేతిలో జార్ఖండ్ 99 పరుగులు భారీ తేడాతో పరాజయం పాలైంది.

స్కోర్

ఢిల్లీ 50 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌట్ అయింది. (నితీష్ రానా 44, పవన్ నేగీ 38 నాటౌట్, ధావన్ 27, రిషబ్ 24, మనన్ శర్మ 21, గంభీర్ 20, రాహుల్ శుక్లా 3/60, వరుణ్ ఆరోన్ 2/43, అంకిత్ దబాస్ 2/46) జార్ఖండ్ 38 ఓవర్లకు 126 పరుగులు చేసి ఆలౌట్ (ధోనీ 70 నాటౌట్, అంకత్ 16, సుభోద్ 4/21, నవదీప్ సైనీ 3/31, ఇషాంత్ శర్మ 2/21, వవన్ నేగీ 1/21).

ఫలితం: జార్ఖండ్ ఢిల్లీ చేతిలో 99 పరుగుల తేడాతో ఓడింది. ఢిల్లీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+