For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని సేనకు షాక్: జోరు మీద హైదరాబాద్ (ఫోటోలు)

విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో వరుస విజయాలతో హైదరాబాద్‌ దూసుకుపోతుంది. మరోసారి బౌలర్లు సమష్టిగా రాణించడంతో హైదరాబాద్‌ జట్టు వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో వరుస విజయాలతో హైదరాబాద్‌ దూసుకుపోతుంది. మరోసారి బౌలర్లు సమష్టిగా రాణించడంతో హైదరాబాద్‌ జట్టు వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. శుక్రవారం భారత మాజీ కెప్టెన్‌ ధోని నాయకత్వంలోని జార్ఖండ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (11), అక్షత్‌ రెడ్డి (9) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన సుమంత్ 76 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 48 పరుగులు, బావనాక సందీప్‌ 71 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేశారు.

మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం

మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం

వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జార్ఖండ్ బౌలర్ నదీమ్‌ బౌలింగ్‌లో ఆనంద్‌సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి సుమంత్‌ వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్‌ బద్రినాథ్‌ (9), సందీప్‌లను నదీమ్‌ వరుస బంతుల్లో క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో 135 పరుగులకే హైదరాబాద్‌ 5 కీలక వికెట్లను కోల్పోయింది.

135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌

135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌

135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ కోలుకోలేకపోయింది. అనిరుధ్‌ (26) పర్వాలేదనిపించగా ఆకాశ్‌ భండారి (13) క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. చివర్లో సీవీ మిలింద్‌ (15), మెహదీ హసన్‌ (15 నాటౌట్‌) రాణించడంతో హైదరాబాద్‌ 204 పరుగులు చేసింది. దీంతో ధోనీ సేనకు 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

44.4 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైన జార్ఖండ్

44.4 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైన జార్ఖండ్

అనంతరం బ్యాటింగ్ చేసిన జార్ఖండ్‌ జట్టు 44.4 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. ధోనీ సారథ్యంలోని జార్ఖండ్‌పై ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లు ఒత్తిడి పెంచారు. రవికిరణ్‌ తన తొలి ఓవర్‌లోనే వరుసగా ఆనంద్‌ సింగ్‌ (0), విరాట్‌ సింగ్‌ (0) వికెట్లను తీయడంతో జార్ఖండ్‌ పరుగుల ఖాతా తెరవకముందే 2 వికెట్లను కోల్పోయింది.

సెంచరీ చేసిన సౌరభ్‌ తివారి

సెంచరీ చేసిన సౌరభ్‌ తివారి

ఇషాన్‌ కిషన్‌ (20) ఎల్బీగా వెనుదిరగగా, సౌరభ్‌ తివారి 104 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులతో 102 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత 2 పరుగుల వ్యవధిలోనే హైదరాబాద్ బౌలర్ మెహదీ హసన్... ధోని (28)తో పాటు మరో రెండు వికెట్లు తీయడంతో జార్ఖండ్‌కు ఓటమి తప్పలేదు.

పాయింట్ల పట్టికలో టాప్‌లో హైదరాబాద్

పాయింట్ల పట్టికలో టాప్‌లో హైదరాబాద్

హైదరాబాద్‌ బౌలర్లలో హసన్‌ 3 వికెట్లు తీసుకోగా రవికిరణ్, సీవీ మిలింద్, ఆకాశ్‌ భండారి తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. సిరాజ్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఏడు జట్లున్న గ్రూప్‌ ‘డి' లో హైదరాబాద్, కర్ణాటక ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో కర్ణాటక జట్టుతో హైదరాబాద్‌ తలపడుతుంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+