సచిన్ రికార్డు బద్దలు: ఫైనల్లో 90 రన్స్, ఎవరీ మయాంక అగర్వాల్

హైదరాబాద్: 2003 వరల్డ్ కప్ సందర్భంగా అంటే సరిగ్గా 15 ఏళ్ల క్రితం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. ఇంతకీ ఆ రికార్డుని బద్దలు కొట్టింది ఎవరని అనుకుంటున్నారా? కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక అగర్వాల్. కర్ణాటకకి చెందిన ఈ యువ ఓపెనర్ 2017-18 సీజన్‌లో అద్భుత ఫామ్‌ని కొనసాగిస్తూ ఇప్పటికే 2,000 పరుగులు పూర్తి చేశాడు.
తాజాగా సౌరాష్ట్రతో మంగళవారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మయాంక అగర్వాల్ (90: 79 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్‌గా అరుదైన రికార్డు సాధించాడు. అంతేకాదు ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 723 పరుగులు నమోదు చేశాడు.
రంజీ ట్రోఫీలోనూ 5 సెంచరీలు సహా మొత్తం 1160 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మూడు హాఫ్ సెంచరీలతో మొత్తం 258 పరుగులు నమోదు చేశాడు.

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన మయాంక అగర్వాల్
దీంతో లిస్ట్-ఏ సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ రికార్డుని బద్దలు కొట్టాడు. 2003 వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ మొత్తం 11 మ్యాచ్‌లాడి 61 యావరేజితో 673 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలవ్వడంతో రన్నరప్‌గా నిలిచింది.

దేశవాళీ క్రికెట్‌లో ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు
మయాంక అగర్వాల్ విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా 109, 84, 28, 102, 89, 140, 81, 90 పరుగుల వరద పారించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ 1,947 పరుగులతో ఉన్నాడు. అతను 2015-16 సీజన్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు.

ఈ సీజన్‌లో అన్ని ఫార్మాట్లు కలిసి 2,141 పరుగులు
తాజాగా ఆ రికార్డ్‌ని మయాంక్ అగర్వాల్ అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో మయాంక అగర్వాల్ అన్ని ఫార్మాట్లు కలిసి 2,141 పరుగులు నమోదు చేశాడు. ఈ సీజన్‌లో అతడు ఇంకా దేవదర్ ట్రోఫీలో ఆడాల్సి ఉంది. మూడో స్థానంలో వసీం జాఫర్ ఉన్నాడు. అతను 2008-2009 సీజన్‌లో 1,907 పరుగులు చేశాడు.

మయాంక అగర్వాల్‌కి సెలక్టర్లు మొండిచేయి
ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో చోటు సంపాదించగా.. ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో మయాంక అగర్వాల్‌కి చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపించారు. శ్రీలంక వేదికగా మార్చి 6 నుంచి జరిగే ఈ ముక్కోణపు టోర్నీకి కోహ్లీ, ధోనీ, హార్దిక్ పాండ్యా, భువీ, బుమ్రా, చాహల్‌కి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు యువ క్రికెటర్లకు చోటు కల్పించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications