IPL స్టార్లు అట్టర్ ఫ్లాప్ షో:జాబితాలో సన్‌రైజర్స్ ఆటగాడు..!!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఐదవ రౌండ్ (జనవరి 6) మ్యాచ్‌ల్లో టీమిండియా స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన మిశ్రమంగా సాగింది. ఒకవైపు శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మరోవైపు ఐపీఎల్ స్టార్లుగా గుర్తింపు పొందిన శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ వంటి వారు దారుణంగా విఫలమయ్యారు.జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లకు అగ్నిపరీక్ష ఎదురైంది. విజయ్ హజారే ట్రోఫీ ఐదో రౌండ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో పలువురు స్టార్ ప్లేయర్లు బ్యాట్ తిప్పలేక చతికిలబడ్డారు.
శ్రేయస్ అయ్యర్ జోరు - గిల్ బేజారు!
చాలా కాలం తర్వాత గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హిమాచల్ ప్రదేశ్‌పై చెలరేగి ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. కానీ, కివీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న శుభ్‌మన్ గిల్ మాత్రం నిరాశపరిచాడు. గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 11 పరుగులకే వెనుదిరిగి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాడు.

విఫలమైన 'ఐదుగురు' ఐపీఎల్ స్టార్లు:
- శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్): పంజాబ్ తరపున ఓపెనర్‌గా వచ్చిన గిల్, 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి వాసుకి కౌశిక్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. గత ఏడు వన్డే ఇన్నింగ్స్‌ల్లోనూ గిల్ కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం.
- రుతురాజ్ గైక్వాడ్ (CSK): మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్, ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు. 167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తన జట్టును గెలిపించలేకపోయాడు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగులు, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.
- ఇషాన్ కిషన్ (SRH): జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్, మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. కివీస్ వన్డే సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో ఈ మ్యాచ్ అతనికి కీలకం కాగా, దారుణంగా విఫలమయ్యాడు.అంతకుముందు కేరళపై 21 పరుగులు చేసి విఫలమైనప్పటికీ..కర్నాటకతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో 125 పరుగులతో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు.
- వెంకటేష్ అయ్యర్ (RCB): మధ్యప్రదేశ్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ కూడా 9 పరుగులకే అవుటయ్యాడు. ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడైన తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసిన ఈ ఆటగాడు గత నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 9,12,16,8 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు.
- వాషింగ్టన్ సుందర్ (GT): తమిళనాడు తరపున ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన సుందర్, త్రిపురపై 30 బంతులు ఆడి కేవలం 9 పరుగులే చేశాడు. బౌలింగ్‌లోనూ ఒక వికెట్ మాత్రమే తీసి నిరాశపరిచాడు.అంతకుముందు రాజస్థాన్‌పై 75 బంతులు ఆడి 36 పరుగులు మాత్రమే చేశాడు.అయితే న్యూజిలాండ్ సిరీస్‌కు ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌కు వాషింగ్టన్ సుందర్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications