
హైదరాబాద్: సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ఇప్పుడు పంజాబ్ టీంను లీడ్ చేయనున్నాడు. ఇప్పటి వరకు పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న హర్బజన్ వ్యక్తిగత కారణాల రీత్యా విజయ్ హజారే ట్రోఫీ 2018కు అందుబాటులో లేకపోవడంతో రెండు మ్యాచ్‌ల వరకు ఆ బాధ్యతలు యువరాజ్ తీసుకోనున్నాడు.
2017, 2018 సంవత్సరాలకు గాను జరగనున్న రంజీ ట్రోఫీలకు టీం లీడ్‌గా హర్బజన్‌ను నియమించారు. ఇటీవలే జరిగిన సయ్యద్ ముస్తఖ్ అలీ టీ 20 ట్రోఫీలో సైతం పంజాబ్ జట్టు తరపున కెప్టెన్‌గా హర్బజన్ వ్యవహరించి జట్టును నడిపించాడు. ఇప్పుడు జరగనున్న విజయ్ హజారే ట్రోఫీకి అతను అందుబాటులో లేకపోవడంతో యువరాజ్ నాయకత్వం వహిస్తాడు. ఒకవేళ ఇద్దరూ కాకుంటే జివాన్‌జోత్ సింగ్ ఆ జట్టు బాధ్యతలు తీసుకుంటాడు.
విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టు తలపడబోతున్న రెండు మ్యాచ్‌లకు భజ్జీ అందుబాటులో ఉండటం లేదు. అతను ఫిబ్రవరి 10 తర్వాత జరిగే మ్యాచ్‌లకు హాజరుకానున్నట్లు సమాచారం.
జట్టులోకి ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన కుర్రాళ్లు చేరడంతో జట్టుకు మరింత బలం చేకూరింది. సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీకి సెలక్ట్ అవ్వని వాళ్లు సైతం వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన తర్వాత విజయ్ హజారే ట్రోఫీకి సునాయాసంగా ప్రవేశం పొందారు.
దీంతో రెండు మ్యాచ్‌లకు యువరాజ్ లీడ్‌గా వ్యవహరించడంతో తర్వాత జరిగే మ్యాచ్‌లకు హర్బజన్ అందుబాటులోకి వచ్చేవరకు సిక్సర్ల వీరుడే సారథిగా కొనసాగుతాడు.
హర్బజన్‌తో కలిపి ట్రోఫీకి ప్రకటించిన జట్టు ఇదే:
Harbhajan Singh(c), Yuvraj Singh, Abhishek Gupta, Abhishek Sharma, Manpreet Gony, Gurkeerat Singh Mann, Siddarth Kaul, Gitansh Khera, Sharad Lumba, Mandeep Singh, Mayank Markande, Sandeep Sharma, Shubman Gill, Barinder Sran, Manan Vohra.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.