For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్రోఫీలో కొత్త నిర్ణయం: కెప్టెన్‌గా సురేశ్ రైనా

Vijay Hazare Trophy 2018-19- Suresh Raina to captain Uttar Pradesh

హైదరాబాద్: చాలా కాలంగా టీమిండియాకు దూరమైన సురేశ్ రైనాను ఐపీఎల్‌కు ముందు నిదహాస్ ట్రోఫీ ద్వారా భారత జట్టులో చోటిచ్చి మళ్లీ దేశం తరపున పోరాడేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే జులై నుంచి టీమిండియాలో ఒకటిగా ఉంటూనే తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు రైనా. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతోన్న ఆసియా కప్‌ టోర్నీలో చోటు దక్కించుకోలేకపోయిన సురేశ్ రైనాకు ఇదొక అద్భుత అవకాశంగా మారింది.

రైనా కెప్టెన్సీలో ఉత్తరప్రదేశ్ జట్టు:

రైనా కెప్టెన్సీలో ఉత్తరప్రదేశ్ జట్టు:

ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న ఈ పదహారు మంది క్రికెటర్లలో సురేశ్ రైనా ఒకడు. ఇంకా రైనాతో పాటుగా రింకూ సింగ్ (కోల్‌కతా నైట్ రైడర్స్‌)కు ప్రాతినిధ్యం వహించాడు. అంకిత్ రాజ్‌పుత్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్ )లు చోటు దక్కించుకున్నారు.

తొలి మ్యాచ్‌ను సౌరాష్ట్ర జట్టుతో

తొలి మ్యాచ్‌ను సౌరాష్ట్ర జట్టుతో

ఎలైట్ గ్రూప్ బీలో భాగమైన ఉత్తరప్రదేశ్ జట్టు తన తొలి మ్యాచ్‌ను న్యూ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా సౌరాష్ట్ర జట్టుతో తలపడనుంది. వీటితో పాటుగా ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిశా, హైదరాబాద్, ఢిల్లీ, కేరళ జట్లు సైతం పాల్గొంటున్నాయి. ప్రస్తుతం రైనా కెప్టెన్సీ వహిస్తోన్న ఉత్తరప్రదేశ్ జట్టుకు ఆఖరి సారి టోర్నీలో పాల్గొన్న సమయంలో అక్షదీప్ నాథ్ కెప్టెన్సీ వహించాడు.

ఆరు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లలో మాత్రమే

ఆరు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లలో మాత్రమే

అప్పట్లో కేవలం ఆడిన ఆరు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించిందీ జట్టు. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళల విషయంలో పరాజయం పొందకతప్పలేదు. టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవాలనుకుంటున్న తరుణంలో ఈ ట్రోఫీ రైనాకు చక్కటి అవకాశంగా మారనుంది. అక్టోబరు, నవంబరు నెలలలో భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్ జట్టుతో ఆడే టీమిండియాలో రైనా ఆడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

విజయ్ హజారే ట్రోఫీలో రైనా జట్టు:

విజయ్ హజారే ట్రోఫీలో రైనా జట్టు:

Suresh Raina (captain), Akshdeep Nath, Shivam Chaudhary, Umang Sharma, Rinku Singh, Priyam Garg, Samarth Singh, Upendra Yadav, Abhishek Goswami, Saurabh Kumar, Shiva Singh, Ankit Rajpoot, Shivam Mavi, Amit Mishra, Yash Dalal, Mohsin Khan.

Story first published: Sunday, September 16, 2018, 14:42 [IST]
Other articles published on Sep 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+