న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విజయ్ హాజారే ట్రోఫీ: ముంబయి తరుపున బరిలోకి పృథ్వీ షా, రహానే

Vijay Hazare Trophy 2018-19: Prithvi Shaw, Ajinkya Rahane included in Mumbai squad for semi-finals

హైదరాబాద్: వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసింది. భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య అక్టోబర్ 21 నుంచి ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. అయితే, వన్డే సిరిస్‌కు ఇంకా సమయం ఉండటంతో భారత జట్టులోని ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, రహానే, పృథ్వీషా ముంబయి తరఫున విజయ్‌ హాజరే ట్రోఫీలో ఆడనున్నారు.

దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హాజారే ట్రోఫీ చివరి దశకు చేరుకోవడంతో ముంబై సెలక్టర్లు తమ జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్లని చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముంబయి జట్టు తరఫున ఓపెనర్ రోహిత్ శర్మ ఆదివారం ఒక మ్యాచ్ ఆడగా.. తాజాగా రహానే, పృథ్వీ షాని కూడా జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేశారు.

వెస్టిండీస్‌ సిరీస్‌కు ఎంపికవ్వడంతో రహానె, షా ఇప్పటి వరకు విజయ్‌ హజారేలో ఆడలేకపోయారు. అయితే, బెంగళూరు వేదికగా బుధవారం జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి జట్టు తరుపున ఈ ముగ్గురు బరిలోకి దిగనున్నారు. ఈ ముగ్గురూ బరిలోకి దిగితే ముంబై జట్టు విజయం సాధించినట్టే.

టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, రహానే, పృథ్వీ షా విజయ్‌ హజారే సెమీస్‌కు అందుబాటులో ఉంటారని ముంబయి చీఫ్‌ సెలక్టర్‌, టీమిండియా మాజీ బౌలర్‌ అజిత్‌ అగార్కర్‌ వెల్లడించాడు. ముంబయి క్వార్టర్‌ ఫైనల్లో బిహార్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. టోర్నీలో రెండు సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు అక్టోబర్‌ 17, 18న జరగనున్నాయి.

సెమీస్‌లో ముంబయి ఎవరితో తలపడనుందో మిగిలిన క్వార్టర్‌ ఫైనల్స్‌ తర్వాత తెలుస్తుంది. వెస్టిండిస్‌తో ఆదివారం ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో పృథ్వీ షా ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ టాప్‌ స్కోరర్‌గా నిలిచి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌'గా ఎంపికయ్యాడు. కాగా, అక్టోబర్ 21 నుంచి వెస్టిండిస్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

Story first published: Monday, October 15, 2018, 18:36 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X